తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగంగా ఉన్నపుడు సమైక్య పాలకులు వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరించడం విచారకరం. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళ నుంచే ఈ వివక్ష ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టింది. దీనివల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును మనం కోల్పోయాం. దీంతో కేంద్రం…
తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం అయిన రోజు. 58 ఏళ్లపాటు వివక్షకు గురైన జనం సొంత రాష్ట్రం సాధించుకున్న అద్భుతమయిన రోజు. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఇవాళ్టితో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి. తొమ్మిదవ ఏట అడుగుపెట్టాం. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.…
పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు.
ప్రగతి భవన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు సీఎం కేసీఆర్. జాతీయ గీతం ఆలాపన. మిఠాయిలు పంచారు నేతలు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్న శుభసందర్భంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకొన్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకొన్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదని చెప్పారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటుంది. దీంతో ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొన్న శుభసందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకొన్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకొన్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద…
మహారాష్ట్ర లో దారుణం జరిగింది. గడ్చిరోలి జిల్లాలో SRPF జవాన్ల మధ్యలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆవేశంతో సహఉద్యోగి పై తన రివాల్వర్ త్ కాల్చిచంపాడు. తరువాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘర్షణలో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. అహేరి తహసీల్ పరిధిలోని మర్పల్లి పోలీసు క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సబ్ డివిజనల్ పోలీసు అధికారి సుజిత్ కుమార్ క్షీరసాగర్ విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన…
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ముస్తాబైంది. ఆవిర్భావ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. కోవిడ్–19 మహమ్మారితో రెండేళ్ల విరామం తర్వాత నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం 9 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌కు వెళ్లడానికి ముందు సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు. గవర్నర్ తమిళిసై…
సీఎం కేసీఆర్ గడువు విధించిన లోపు అమరుల స్మారక చిహ్నాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిర్మాణానికి అవసమరమైన స్టెయిల్ లెస్ స్టీల్ ప్యానెల్స్ దుబాయ్ నుంచి త్వరగా దిగుమతి అయ్యేట్లు చూడాలని.. క్లాడిండ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాన తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులు అర్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అమరుల త్యాగాలు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2022 జూన్ 2 నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతుంది. మరి కొన్ని రోజుల్లో తెలంగాణ అవతరణ రోజు రాబోతుండటంతో ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. దీంట్లో భాగంగా సీఎస్ సోమేష్ కుమార్ రాష్ట్ర అవతరణ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 వ తేదీన ఉదయం…