ప్రతీ రాష్ట్రం అభివృద్ధి మేము కట్టుబడి ఉన్నామని.. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ చరిత్ర పోరాటాలతో నిండి ఉందని.. తెలంగాణ ఏర్పాటు కోసం యువత ఏళ్ల తరబడి పోరాడి త్యాగాలు చేశారని ఆయన అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా జూన్, 2014న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణకు ఏం నిధులు ఇవ్వలేదని…
రాష్ట్రంలో 32 జిల్లా కోర్టులు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషం, గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.భారత ప్రధాన నాయమూర్తి ఎన్వీ రమణతో కలిసి సీఎం కేసీఆర్ 32 జిల్లా కోర్టులు ప్రారంభించారు. తెలంగాణ తలసరి ఆదాయం, రాష్ట్ర ఆదాయం, వ్యవసాయ, ఇండస్ట్రీ, ఐటీ గ్రోత్ లో ముందుందని కేసీఆర్ తెలిపారు. గతంలో ఎన్వీ రమణ గారు హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా ఉన్న సమయంలో నేను కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జడ్జీల సంఖ్య పెంచారని..…
అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే.. ఇరు పార్టీలు తెలంగాణలో ఎన్నికల తరహా వాతావరణాన్ని తీసుకువచ్చాయి. తాజాగా తెలంగాణ ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ డెవలఫ్మెంట్ కు కేంద్రం మోకాలడ్డు పెడుతుందని టీఆర్ఎస్ అంటుంటే.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కప్పగా మార్చారంటూ బీజేపీ ఫైర్ అవుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్…
కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ సంతకాల సేకరణ చేపట్టడంపై తెలంగాణ బీజేపీ అద్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే భాగలక్ష్మి ఆలయంపై చేయి వేయాలంటూ సవాల్ విసిరారు. ‘‘మేం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటేనే.. మీకు నమాజ్ గుర్తొచ్చిందా?. అంతకుముందు నమాజ్ ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్‌ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ దగ్గర ఆలయం లేదని చెప్పేవాడు మూర్ఖుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలే…
భాగ్యనగరంలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని అనేకసార్లు ప్రధానిని అడిగినా ఫలితం లేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయ పరమైన నిధులపై కేంద్రం కోత విధించిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దారుణంగా విఫలం అయిందన్నారు.…
75సంవత్సరాలలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రమూ సాధించని విజయాలను ఎనిమిదేండ్లలోనే తెలంగాణ సాధించిందని కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద అమర వీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో.. పాలుపంచుకున్న వారందరికి ప్రత్యేక వందనాలు…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మరోవైపు, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా…
తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలు బీజేపీ ఆధ్వర్యంలోని కాషాయ జెండాతోనే నేరవేరతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ అమర వీరులను స్మరించుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరికీ అభినందనలు తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ఛిన్నాభిన్నమైందని ఆవేదన…
రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మిన్నంటాయి. కొద్దిపాటి అధికార గణం.. కళాకారుల సమక్షంలో వేడుకలను నిర్వహించింది రాజ్‌భవన్. తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ మాత్రమే కాదు.. ఒక సహోదరిని కూడా. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. రాజ్ భవన్ స్కూల్ లో భోజన సౌకర్యం కల్పించామని అన్నారు. భద్రాచలం, ఖమ్మం ఆదివాసులతో భోజనం చేసి..పౌష్టికాహారం…