తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటుంది. దీంతో ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొన్న శుభసందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకొన్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకొన్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదని చెప్పారు.
మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్‌లోని శాస్త్రినగర్ ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తున్నదని తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన వేడుకల్లో అసెబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిశారు.
శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజయ్యారు. కలక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముదు చిన్న శంకరంపేటలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిచారు. వరంగల్ కోటలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు ల గౌరవ వందనం స్వీకరించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్ జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పెరేడ్ మైదానంలో జరిగిన ఉత్సవాలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ప్రజల ముందుంచారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సంగరెడ్డి కలెక్టరేట్‌లో హోమ్ మంత్రి మహమూద్ అలీ జాతీయ జెండా ఎగురవేశారు.
మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలకు మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టరేట్‌లో జాతీయ పతాకావిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ప్రజలముందుంచారు.
మంత్రి జగదీశ్ రెడ్డి
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్చించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
ఎనిమిదేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక రంగాల్లో దేశంలోనే నంబర్ 1 గా నిలిచిన మన తెలంగాణ నిలిచిందని టీఆర్ఎస్ పార్టీ తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.
ఎనిమిదేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక రంగాల్లో దేశంలోనే నంబర్ 1 గా నిలిచిన మన తెలంగాణ
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు #JaiTelangana #TelanganaFormationDay pic.twitter.com/kKIAnOYCuL
— TRS Party (@trspartyonline) June 2, 2022
కాగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటి తో ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదర సొదరీమణులందరికీ శుభాకాంక్షలు అన్నారు. చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం అంటూ ట్వీట్ చేశారు.
తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలు
ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం.
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2022
ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని చిదంబరం, సుశీల్ కుమార్ శిండే ప్రకటించిన చారిత్రాత్మక దినాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆరోజు అమిత్ షా ఎక్కడున్నాడు? ఓ మర్డర్ కేసులో జైలులో ఉన్నాడు, అప్పుడు బెయిల్ మీద బయటకొచ్చాడని, తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేయడంతో అదికాస్త వైరల్ గా మారింది.
Let’s not forget the History on #TelanganaFormationDay
Congress Home minister Sh @PChidambaram_IN ji & @SushilShindeINC ji announcing the process and completion of formation of Telangana. Where was Amit Shah then ? He was in Jail and then in bail for murder case. pic.twitter.com/0wMZIaQDGF— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) June 2, 2022