Governor Tamilisai: అమరవీరులను స్మరిస్తూ బావోద్వేగంతో గవర్నర్ తమిళి సై ప్రసంగించారు. మొత్తం ప్రసంగాన్ని తెలుగులోనే గవర్నర్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై.
CM KCR: తెలంగాణలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే లు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM KCR: జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Kishan Reddy: తెలంగాణలో ఉన్న మత పరమైన రిజర్వేషన్లు తీసేయాలని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే గిరిజనులకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అందుతాయని అన్నారు.
Minister Jagadish Reddy: కొంగ , దొంగ జపాలకు తెలంగాణా ప్రజలు నమ్మరని మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్, బీజేపీ లు చేస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలపై ఆయన స్పందించారు.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారికి సన్మాన కార్యక్రమాలు ఉంటాయని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. 3, 4, 5 తేదీల కార్యక్రమాలు త్వరలో చెబుతామన్నారు. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి మొదట నివాళులు అర్పించిన తర్వాత.. బాబూ జగజ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పిస్తాం.. హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చిన్నారెడ్డి చెప్పుకొచ్చారు.
CM KCR: నేడు సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు పాల్గొంటారు.