Minister Jagadish Reddy: కొంగ , దొంగ జపాలకు తెలంగాణా ప్రజలు నమ్మరని మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్, బీజేపీ లు చేస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలపై ఆయన స్పందించారు. 9 సంవత్సరాల కేసీఆర్ జనరంజక పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణా సాధించిన ప్రగతి దేశానికి చాటేందుకు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నామన్నారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఊహకు మించి అభివృద్ధి సాధించామని తెలిపారు. ఆరు దశబ్దాలుగా తెలంగాణాను చీకట్లోకి నెట్టిన కాంగ్రెస్, తెలంగాణా అభివృద్ధిని నిరోధించే బీజేపీలు ఏమని పోటీ ఉత్సవాలు చేస్తాయమని పేర్కొన్నారు. కేవలం ఓట్లు, అధికారం పరమావధిగా రెండు పార్టీల తీరు కనిపిస్తుందని అన్నారు. దేశ వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్ ఫెయిల్యూర్ పార్టీ వారు ఫెయిల్యూర్ సభలే చేసుకోవాలని మండిపడ్డారు. కిషన్ రెడ్డి తెలంగాణపై మాట్లడితే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు. వచ్చిన తెలంగాణా ప్రకటన వెనక్కి తీసుకుంటే రాజీనామాకు భయపడ్డ వారు తెలంగాణ గురించి ఏం మాట్లాడుతారు? అంటూ ప్రశ్నించారు.
Read also: PVP Tweets: నీ బిల్డప్ ఏందయ్యా కేశినేని నాని.. అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అనుకుంటున్నావా..
కాంగ్రెస్, బీజేపీలు ఓట్ల రాజకీయం కోసమే పోటీ ఉత్సవాలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణా ప్రయోజనాలు తాకట్టు పెట్టిన మోడీ ఏడు మండలాలు ఆంధ్రాలో విలీనం చేశాడని మండిపడ్డారు. కాంగ్రెస్ , బీజేపీ లు తెలంగాణా కోసం ఏ లాభం చేకూర్చారో ప్రజలకు చెప్పాలి? అంటూ ప్రశ్నించారు. కొంగ , దొంగ జపాలకు తెలంగాణా ప్రజలు నమ్మరని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి ఆవిర్భావ వేడుకలు చేసుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సహా ఏడు మండలాలను కలిపిన పార్టీకి తెలంగాణపై మాట్లాడే అర్హత ఎక్కడిదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చేస్తానని పారిపోయిన కిషన్ రెడ్డి. తొమ్మిదేళ్లలో ఊహకు అందని అభివృద్ధి చేసినందుకే దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పరిణామాలన్నింటిలో భాగస్వాములైన బీఆర్‌ఎస్ శ్రేణులు దశాబ్ధ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో బల్బులు వెలుస్తున్నాయన్నారు. వసూళ్లలో సాధించిన విజయాలే సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు