Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేడు పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఉదయం ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రజలు సిద్ధమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఉదయం 9:30 గంటలకు…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయి పదకొండవ సంవత్సరంలో అడుగుపెడుతోంది
రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనదని ఆ లేఖలో తెలిపారు.
సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఆ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కీంలలో స్కామ్‌లు జరిగాయని.. గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్‌తో సహా 12 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామన్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. విపక్ష నేతగా, తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర అవతరణ దినోత్సవ ఆహ్వానం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్‌ఛార్జ్ హర్కర వేణుగోపాల్ రావుకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. . రాష్ట్ర ముఖ్యమంత్రి తోపాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, యారా ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికిందరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టాయి. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో…
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.