తెలంగాణలో చీటింగ్.. కరప్షన్ ప్రభుత్వం ఉందని సీబ్ల్యూసీ సభ్యులు పవన్ ఖేరా విమర్శలు గుప్పించారు. యువతని మోసం చేసింది.. తెలంగాణ నిరుద్యోగంలో 15 శాతం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ నిరుద్యోగంలో నెంబర్ వన్.. తెలంగాణ ఆత్మహత్యలకు కాపిటల్ గా మారింది అని ఎద్దేవా చేశారు. 200 కోట్లు పరీక్ష ఫీజు పేరుతో వసూలు చేశారు కానీ.. పరీక్షలు లేవు.. ఉద్యోగాలు ఇవ్వలేదు.. 2021 నుంచి ఇప్పటికి 567 మంది యువత ఆత్మహత్య చేసుకున్నారు.. కానీ, కేసీఆర్ కి ఇదేం పట్టడం లేదు అని పవన్ ఖేరా మండిపడ్డారు.
Read Also: BJP Star Campaigners: బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ విడుదల.. ఆమె పేరు మిస్సింగ్..!
ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అని సీబ్ల్యూసీ సభ్యులు పవన్ ఖేరా మండిపడ్డారు. యువకులు మీ మీద ఎందుకు ఆక్రోశంతో ఉన్నారో ఆలోచన చేశారా అని ఆయన అడిగారు. తెలంగాణలో సమస్యలకు పరిష్కారం నవంబర్ 30 జరిగే ఎన్నికలే నిదర్శనం.. ప్రజల్లో ఆవేశం.. ఎవరికి మంచిది కాదు.. యంగ్ స్టేట్ లో ఇలాంటి ఆవేశకవేశాలు సరికాదు అని పవన్ ఖేరా తెలిపారు. మీ కోపాన్ని.. నవంబర్ 30 న ఓటు రూపంలో తెలపండి అని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Minister KTR: వేములవాడను దత్తత తీసుకుంటాను.. గెలిపించక పోతే ఇక్కడికి రాను
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని పవన్ ఖేరా పేర్కొన్నారు. ఒక మొబైల్ ఫోన్ కొంటేనే గ్యారంటీ అడుగుతున్నాం.. అలాంటిది ఎన్నికల్లో ప్రజలు కూడా అడగాలి.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ప్రజలకు గ్యారెంటీ ఇస్తున్నారు అని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నమ్మితే మిమ్మిల్ని దోచుకుంటారని పవన్ ఖేరా వెల్లడించారు.