కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. నేను కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్లిన మీ గుండెల్లోనే ఉంటాను అని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో ఉంటాడు.. నా కోసం కష్టపడే దాంట్లో రెట్టింపు స్థాయిలో కష్టపడి రేవంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని షబ్బీర్ అలీ కోరారు.
Read Also: Rashmika Mandanna: బ్రేకింగ్.. డీప్ ఫేక్ వీడియో.. స్పందించిన రష్మిక
ఈనెల 10వ తేదీన రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. నామినేషన్ అనంతరం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కామారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు అని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించి సీఎం కేసీఆర్ ను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి అని పిలుపునిచ్చారు. కామారెడ్డిలో ఉన్న భూములను లాక్కునేందుకే కేసీఆర్ ఇక్కడికి వస్తున్నాడు అంటూ షబ్బీర్ అలీ ఆరోపించారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి అని ఆయన కోరారు. కామారెడ్డి ప్రజలు సీఎం కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని షబ్బీర్ అలీ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు ప్రజలకు ఆయన చేసిందేమి లేదని చెప్పుకొచ్చారు. నిరుద్యోగులను కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని ఆయన తెలిపారు.