తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న MPTC, ZPTC ఎన్నికలపై జారీ చేసిన గెజిట్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మేరకు సెప్టెంబర్ 29న విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. Hyderabad Drugs: రూటు మార్చిన డ్రగ్ స్మగ్లర్లు.. కొంపలోనే కుంపటి పెట్టారు! హైకోర్టు ఆదేశాలు అందిన వెంటనే ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎన్నికల కమిషన్ గెజిట్…
Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మొత్తం 16 జడ్పీటీసీ, 103 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అన్ని జిల్లాల్లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. పార్టీ నాయకులు, అభ్యర్థులు నామినేషన్లు వేయడంలో పోటీ పడుతున్నారు. జడ్పీటీసీ స్థానాల విషయానికి వస్తే, సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 7 నామినేషన్లు దాఖలు…
KTR : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలను ప్రదర్శించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీను నిర్ధారించకుండా నిలిపి, రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో నిలబడని జీఓ (గవర్నమెంట్ ఆర్డర్) ద్వారా బీసీలకు హామీ ఇచ్చినట్లు మభ్యపెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా వెన్నుపోటు పొడిచిన…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి.
Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్ (EC). ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపామన్నారు ఎన్నికల అధికారులు. ఇక ఎన్నికల్లో భాగంగా 565 మండలాల్లో ఎంపీటీసీ (MPTC) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరగనున్నాయి. Indira Canteen: కేవలం రూ.5కే బ్రేక్‌ఫాస్ట్, భోజనం.. ‘ఇందిరా క్యాంటీన్’ ప్రారంభం ఇందులో భాగంగా అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ(ZPTC) మొదటి విడత ఎన్నికలు…
KTR: సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.. రేవంత్‌కు దమ్ముంటే 10 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.. ఎన్నికల్లో ఎవరి సత్తా ఏందో తేల్చుకుందామన్నారు.. జోగులాంబ జిల్లా గద్వాలలోని తేరు మైదానంలో నిర్వహించిన ‘గద్వాల గర్జన’ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్నారు.
తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు చివరకు పచ్చజెండా ఊగబోతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది.
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఎలా ఉంది? ఏపీలో పొత్తులున్నా... తెలంగాణలో మాత్రం మేం సింగిల్ అంటున్న కమల నేతలు... జూబ్లీహిల్స్‌లో కూడా అదే స్టాండ్ తీసుకుంటారా? అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? అసలు తెలంగాణలో టీడీపీని ఎందుకు వద్దనుకుంటోంది కాషాయ పార్టీ? లెక్కల్లో ఎక్కడ తేడా కొడుతోంది?
Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లా స్థాయిలో సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది వివరాలు, మరియు ఇతర సామగ్రికి సంబంధించిన సమాచారాన్ని…