Off The Record: తెలంగాణ కమలం లొల్లి ఇప్పట్లో కొలిక్కి రాదా? ఎడ్డెమంటే తెడ్డెమనే నైజం మారదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అది మరింత ముదిరిందా? ఓ వైపు డిపాజిట్ కూడా దక్కకుండా జనం కర్రుగాల్చి వాత పెట్టినా.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని పేర్కొంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయని మంత్రివర్గ భేటీ స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. వారోత్సవాల సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. Also Read: Niloufer Cafe Babu…
Jubilee Hills By-Election Result 2025: రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు తేలనున్నాయి..
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఘటనలను హైదరాబాద్ సిటీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులపై మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్ లపై రెండు కేసులు నమోదు కాగా, బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్ పై మరో…
‘కింగ్ అవ్వుడు సంగతి పక్కనపెట్టు.. ముందు డిపాజిట్ తెచ్చుకో’ అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, కేటీఆర్ వేరు కాదని.. ఇద్దరు నాణెంకు ఉండే బొమ్మ బొరుసు లాంటి వాళ్లే అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు సీబీఐకి ఇవ్వు అని చెప్పిన కిషన్ రెడ్డి.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కిషన్ రెడ్డి.. నీకు ఎవడు భయపడడు అని సీఎం రేవంత్ అన్నారు.…
TPCC Mahesh Goud : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో ఆయన సమావేశమై, ఎన్నికల వ్యూహాలపై కీలక సూచనలు చేశారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. “ఇది చాలా కీలకమైన సమయం. ఈ వారం రోజులు ఎన్నికల ఫలితాలను నిర్ణయించే రోజులు. ప్రతి నాయకుడు తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలి. చిన్న నిర్లక్ష్యం కూడా…
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. “జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరేస్తుంది అనే నమ్మకం నాకు వచ్చింది. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం. ప్రతి సారి అవకాశం రావడం జరగకపోవచ్చు కానీ,…
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జంబో బ్యాలెట్ ఎవరి కొంప ముంచబోతోంది? నెక్ టు నెక్ ఫైట్లో వాళ్ళ ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? 58 మంది అభ్యర్థులు బరిలో ఉంటే… అందులో 48 మంది నాన్ లోకల్సే ఎందుకున్నారు? అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మీద కూడా పగ తీర్చుకోవడానికి నామినేషన్స్ వేశారా? రెండు పార్టీలను ఒకేసారి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎక్కడైనా ఎన్నికలంటే… సాధారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఓ…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 127 పోలింగ్ స్టేషన్ల లో 407 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ఒక్కో పోలింగ్ బూత్ కి నాలుగు చొప్పున 1,628 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేశారు పోలింగ్ అధికారులు. అదనంగా 20 శాతం బ్యాలెట్ యూనిట్లను సిద్ధంగా పెట్టుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. Read Also: Friends Attacked Private Parts:మీరేం ఫ్రెండ్స్ రా ……