University : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (SSCTU) లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు నివసించే ప్రాంతంలో ఏర్పాటు అవుతూ, అత్యుత్తమ రీసెర్చ్-ఆధారిత యూనివర్సిటీగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. “జ్ఞానం పరమం ధ్యాయం” అనే నినాదంతో ఈ విశ్వవిద్యాలయం అనువర్తిత, పరిశోధన , ఆవిష్కరణలకు కేంద్రంగా…
మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ హరీష్ రావు.. మీలాగా మాటలు కాదు, చేతల ప్రభుత్వం మాది అని విమర్శించారు. విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం అని, శంకుస్థాపన స్థాయిలో వదిలి వెళ్లిపోయిన హాస్పిటల్స్ ఈ 21 నెలల్లో వేగంగా నిర్మిస్తున్నాం అని అన్నారు. మీ ప్రభుత్వం 40 వేల కోట్ల బకాయి పెట్టిపోతే.. తాము చెల్లిస్తున్నాంఅని మండిపడ్డారు. నిత్యం మా ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష…
తెలంగాణలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా సమగ్ర మద్దతు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణలో స్థాపించేందుకు కేటాయించినట్లు ప్రకటించబడింది.
Inter Board : రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ ప్రకటించారు. పరీక్షల పద్ధతిలో కూడా మార్పులు ఉంటాయని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఆధునిక విద్యను అందించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని వివరించారు. నవంబర్ నెల నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తరగతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనివల్ల భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులు సిద్ధం…
తెలంగాణ విద్యా విధానం రూపకల్పన కోసం కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యా విధానం కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేశవరావు ఎన్నికయ్యారు. కమిటీలో ఛైర్మన్ సహా మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. కడియం శ్రీహరి, ఆకునూరి మురళీ, సీఎస్ రామకృష్ణారావు, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాల కిష్టారెడ్డి సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు: 1. డా. కేశవ…
పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని.. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Telangana : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యా రంగంలో మరో ముఖ్యమైన సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)ను శనివారం నుంచి విజయవంతంగా అమలు చేసింది. విద్యా రంగంలో డిజిటల్ మార్పుకు ఇది ఒక కీలక అడుగుగా అధికారులు పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా విద్యార్థుల హాజరు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నమోదు అవుతుంది. ప్రాక్సీ హాజరు లేదా రికార్డుల్లో తారుమారు…
SSC Exam : తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యాసంవత్సరం నుండి ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షల్లో ఇప్పటివరకు అమలులో ఉన్న 80% బాహ్య మూల్యాంకనం (External Assessment), 20% అంతర్గత మూల్యాంకనం (Internal Assessment) పద్ధతిని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం నుంచి ఆగస్టు 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, గతంలో జారీ చేసిన కొన్ని ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసి, పాత విధానాన్నే కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్, వరంగల్ ఆర్డీజేలు,…
TG CPGET-2025 PG Entrance Exams: వచ్చే నెల(ఆగస్టు) 4వ తేదీ నుంచి తెలంగాణలో పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో TG CPGET-2025 పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ PG కోర్సులు, డిప్లొమాలు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు పెట్టనున్నారు.