తెలంగాణ విద్యా విధానం రూపకల్పన కోసం కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యా విధానం కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేశవరావు ఎన్నికయ్యారు. కమిటీలో ఛైర్మన్ సహా మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. కడియం శ్రీహరి, ఆకునూరి మురళీ, సీఎస్ రామకృష్ణారావు, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాల కిష్టారెడ్డి సభ్యులుగా ఉన్నారు.
కమిటీ సభ్యులు:
1. డా. కేశవ రావు, సలహాదారు – ఛైర్‌పర్సన్
2. డా. కడియం శ్రీహరి, MLA – సభ్యుడు
3. శ్రీ అకునూరి మురళి, IAS – ఛైర్మన్, TGEC – సభ్యుడు
4. శ్రీ కె. రామకృష్ణారావు, IAS, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి – సభ్యుడు
5. డా. యోగితా రాణా, IAS, విద్యాశాఖ కార్యదర్శి – సభ్యుడు, కన్వీనర్
6. ప్రొ. బాల కిష్టా రెడ్డి, ఛైర్మన్, TGHEC – సభ్యుడు
7. ఛైర్‌పర్సన్ కోరుకున్న ఇతర సభ్యులు
Also Read: KTR: ధర్నాలకు పిలుపునిచ్చిన కేటీఆర్.. సిద్ధమవుతున్న బీఆర్ఎస్ శ్రేణులు!
కమిటీ విధివిధానాలు:
# జాతీయ విద్యా విధానం (NEP) 2020 ను అధ్యయనం చేసి, తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయడం.
# డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతపై దృష్టి సారించి.. కొత్త ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన విద్యను రూపొందించడం
# విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య పరిశోధన, సహకారాన్ని బలోపేతం చేయడానికి సూచనలు ఇవ్వడం
# పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వృత్తిపరమైన విద్యలో సంస్కరణలు సూచించడం.. అందరికీ సమానత్వం, ప్రాప్యత, నాణ్యత ఉండేలా చూడటం.
# మరేవైనా ఇతర విధివిధానాలు.
కమిటీ తన నివేదికను 2025 అక్టోబర్ 30 నాటికి సమర్పించాలి.