Telangana : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యా రంగంలో మరో ముఖ్యమైన సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)ను శనివారం నుంచి విజయవంతంగా అమలు చేసింది. విద్యా రంగంలో డిజిటల్ మార్పుకు ఇది ఒక కీలక అడుగుగా అధికారులు పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా విద్యార్థుల హాజరు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నమోదు అవుతుంది. ప్రాక్సీ హాజరు లేదా రికార్డుల్లో తారుమారు…
SSC Exam : తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యాసంవత్సరం నుండి ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షల్లో ఇప్పటివరకు అమలులో ఉన్న 80% బాహ్య మూల్యాంకనం (External Assessment), 20% అంతర్గత మూల్యాంకనం (Internal Assessment) పద్ధతిని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం నుంచి ఆగస్టు 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, గతంలో జారీ చేసిన కొన్ని ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసి, పాత విధానాన్నే కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్, వరంగల్ ఆర్డీజేలు,…
TG CPGET-2025 PG Entrance Exams: వచ్చే నెల(ఆగస్టు) 4వ తేదీ నుంచి తెలంగాణలో పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో TG CPGET-2025 పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ PG కోర్సులు, డిప్లొమాలు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు పెట్టనున్నారు.
TG Inter Board : తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ విద్యలో పలు మార్పులను ప్రతిపాదించింది. ఆర్ట్స్ గ్రూప్‌లతో పాటు భాషా సబ్జెక్టుల్లో కూడా ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు భావిస్తోంది. మొత్తం 100 మార్కుల్లో 20 మార్కులను ప్రాజెక్టులు లేదా అసైన్‌మెంట్‌ల రూపంలో ఇంటర్నల్‌గా కేటాయించి, మిగతా 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఆమోదం ఇస్తే, సైన్స్ గ్రూప్‌లతో పాటు ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు కూడా…
TGTET 2025 : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) జూన్ సెషన్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం ఉదయం ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా అధికారికంగా ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం అభ్యర్థులలో 33.98 శాతం మాత్రమే అర్హత సాధించినట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం టెట్ జూన్ సెషన్ పరీక్షలు జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించబడ్డాయి. ప్రాథమిక ఫలితాలను ఇప్పటికే జూలై 5న ప్రకటించిన సంగతి తెలిసిందే. పేపర్…
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. గుండె నొప్పితో ఇంటర్ సెకండియర్ విద్యార్థి మృతి చెందాడు. ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బత్తిని మనితేజ (17) గుండె నొప్పితో మృత్యుఒడికి చేరుకున్నాడు. మణితేజ స్వగ్రామం శాయంపేట మండలం ప్రగతి సింగారం.
Minister Sridhar Babu : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంచిర్యాల జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ల అమలుపై కట్టుబాటుతో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉత్తమ భోజనం, మెరుగైన…
Bandi Sanjay Kumar: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని విద్యార్థుల కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చేపట సేవా కార్యక్రమాల్లో భాగంగా.. ఈ సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా 20 వేల సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పిల్లల విద్యాభ్యాసానికి ప్రోత్సాహంగా, ప్రధానమంత్రి మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది. ముఖ్యంగా టెన్త్ తరగతి చదువుతున్న విద్యార్థులకు బండి సంజయ్ స్వయంగా సైకిళ్లను అందజేస్తున్నారు. తొలిరోజు కరీంనగర్ టౌన్…
CM Revanth Reddy: పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పదో తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తోందని… ఇంటర్మీడియట్ పూర్తయ్యే సరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి గల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. విద్యా శాఖపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమైనందున.. ఆ…
Jawahar Navodaya: తెలంగాణలో కొత్తగా మంజూరైన ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల ప్రారంభానికి సంబంధించి తాజాగా విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి (NVS) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుండి ఉపాయుక్తులు శ్రీ టి. గోపాల్ కృష్ణ, టి. సూర్యప్రకాశ్, బి. చక్రపాణి హాజరయ్యారు. అలాగే పాఠశాల విద్యా…