Karimnagar: కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం రంగపేటలో వడ్ల దొంగతనం కలకలం రేపింది. రంగపేట ఐకేపీ సెంటర్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు దొంగలు వడ్ల సంచులు దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. టాటా ఏసీ వాహనంలో సుమారు 20 వడ్ల సంచులు ఎక్కిస్తున్న సమయంలో రైతులు అప్రమత్తమయ్యారు. తక్షణమే అక్కడికెళ్లిన రైతులు దొంగలను అడ్డుకున్నారు. ఆ సమయంలో ఒక దొంగను పట్టుకుని గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Newlywed Woman Suicide in Vikarabad: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధి కోస్గి మండలం పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే కాటికి చేరింది. చంద్రవంచ గ్రామానికి చెందిన నవవధువు గొల్ల శ్రీలత(21) పెళ్ళైన మూడు రోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది..
Warangal: వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమవిఫలమవ్వడంతో చెన్నరావుపేట మండలం ధర్మతండాకు చెందిన మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం మిగిలించింది. తాను ప్రేమించిన యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న మహేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనకు ప్రేమించిన అమ్మాయితో వివాహం జరగదని తేలడంతో మానసికంగా కుంగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Medchal: మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం గోరక్షక్ సభ్యుడు ప్రశాంత్ అలియాస్ సోనుపై కాల్పులు జరిగాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. కీసర మండలం రాంపల్లికి చెందిన సోను గోవుల తరలింపు విషయంలో అడ్డుపడుతున్నాడని బహదూర్పురాకు చెందిన ఇబ్రహీం చౌదరి అనే వ్యక్తి పోచారం పోలీస్ స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిచినట్లు సమాచారం. ప్రశాంత్ అలియాస్ సోనుకి గోవుల తరలింపు సమాచారం…
మందు తాగుదామని చెప్పి మత్తులోకి చేరుకున్నాక స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. ఎర్రకుంటకు చెందిన అబ్దుల్ ఫతేలి ఆటోడ్రైవర్ (32) వృత్తి రిత్యా ఆటోడ్రైవర్. పాతబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ జహంగీర్ లు స్నేహితులు. వీరిద్దరు తరచు మద్యం సేవిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే అబ్దుల్ ఫతేలికి మద్యం తాగుతామని చెప్పి జహంగీర్ మద్యంతో పాటు ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకుని బాలాపూర్ బారామల్గి వెనుక వైపుకు వచ్చాడు.…
Hyderabad: మేడ్చల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రిని కన్న కొడుకే హత్య చేసిన ఘటన స్థానికులను కలచివేసింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ దారుణం వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ ప్రస్తుతం మేడ్చల్లో నివసిస్తున్నాడు. అతని కుమారుడు షేక్ సాతక్ తన స్నేహితుడు రాజుతో కలిసి మంగళవారం రాత్రి మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Husband Throws Wife: మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి బ్రిడ్జ్ పైనుంచి భార్యను తోసి హత్య చేసిన సంఘటన ఆదివారం నాడు అర్ధరాత్రి జరిగింది.
Crime News: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చిన కూతురు.. ఏం తెలియనట్టు తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో చిన్న కూతురు నవనీత బాగోతం బయట పడింది.
Kumuram Bheem Asifabad: భార్య మీద కోపంతో అత్తింటికి నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి... ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లా పటార్లో చోటు చేసుకుంది. ఎల్లాపటార్కు చెందిన షమాబీకి జైనూర్ మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్తో 9 నెలల కిందట వివాహం జరిగింది. తనకు పెళ్లి ఇష్టం లేదంటూ ముజాహిద్.. షమాబీతో తరుచూ గొడవ పడేవాడు. తాజాగా ఎల్లాపాటార్ వచ్చి మళ్ళీ భార్యతో గొడవపెట్టుకున్నాడు.. గొడవ ఒక్కసారిగా పెరిగింది.…