Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- వికారాబాద్‌లో ఘోర అమానుషం
- ఆస్తి కోసం కన్న కొడుకు ఘాతుకం
- పెట్రోల్, డీజిల్‌తో దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి.. సవతి తల్లి కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. ఆస్తి కూడా దక్కదని తెలిసి రాక్షసునిగా మారాడు. ఏకంగా తండ్రిని, సవతి తల్లి కుటుంబాన్ని మూకుమ్మడిగా హత్య చేయాలని డిసైడయ్యాడు. తన ప్లాన్ అమలు చేయడంతో ఇంటిల్లిపాది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇంతకీ ఆ కొడుకు ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగింది?
తండ్రి తీసుకున్న కఠిన నిర్ణయం.. కొడుకు మనసులో పెరిగిన బాధ.. చివరకు ఒక కుటుంబాన్ని అగ్నికి ఆహుతి చేసిన విషాద ఘటనగా మారింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్‌సింగ్ తండా గ్రామంలో ఈ దారుణం జరిగింది. డబ్బు ముందు మానవ సంబంధాల విలువను ఈ ఘటన మళ్లీ ప్రశ్నార్థకంగా మార్చింది.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ఇటీవలే గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది రమణి బాయి. ఐతే ఆ కుటుంబం.. బయటకు చూస్తే సంతోషంగా కనిపించినా.. లోపల మాత్రం విభేదాల మంటలు రగులుతున్నాయి. భర్త హన్మంతుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య 5 నెలల క్రితం మరణించింది. ఐతే ఆమెకు పుట్టిన కొడుకు అనార్‌సింగ్ హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నాడు.
తల్లి మరణం తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన రైతు బీమా రూ.5 లక్షలు, అలాగే కుటుంబ ఆస్తిలో తన వాటా కావాలని తండ్రి హన్మంతును అడిగాడు కొడుకు అనార్ సింగ్. అయితే హన్మంతు మాత్రం ఆ డబ్బులు, ఆస్తి ఇవ్వనని మొండిగా నిలబడ్డాడు. దీంతో తండ్రీ-కొడుకుల మధ్య విభేదాలు షురూ అయ్యాయి. ఇద్దరూ గ్రామంలో పంచాయితీ చేసుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది.
సరిగ్గా ఇక్కడి నుంచే అనార్ సింగ్ ఆలోచనలు తప్పుదారి పట్టాయి. నాకేం దక్కదు అన్న నిస్సహాయ భావన ఆవరించింది. దీంతో ఆస్తి కోసం అత్యంత దారుణమైన ప్లాన్ వేశాడు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తన తండ్రి హన్మంతుతోపాటు.. పిన్ని సర్పంచ్ రమణి బాయి, వారి ఇద్దరు పిల్లలు వెంకటేష్, శివను చంపాలని స్కెచ్చేశాడు. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ తీసుకు వచ్చాడు. ముందుగా ఇంటికి తాళం వేశాడు. అనంతరం పైకప్పు రంధ్రం ద్వారా పెట్రోల్, డీజిల్ పోసి ఇంటికి నిప్పంటించాడు. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. లోపల ఉన్న నలుగురు ప్రాణాల కోసం అరుస్తుండగా.. ఆ కేకలు గ్రామాన్ని కుదిపేశాయి…
పక్కనే ఉన్న గ్రామస్తులు పరుగెత్తుకొచ్చి తలుపులు బద్దలు కొట్టి బాధితులను బయటకు తీసి 100 నంబర్‌కు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపించారు. ప్రస్తుతం వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటనలో అనార్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
సర్పంచ్ కుటుంబాన్ని అంతం చేయాలనుకున్న అనార్‌సింగ్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!