Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి పూర్తి భిన్నమైన జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల వరుసగా కామెడీ సినిమాలతో సందడి చేస్తున్న ఆయన, ఇప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ‘హైవానియత్’ సినిమాతో అక్షయ్ తన కెరీర్లో మరో కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉండగా, తాజాగా అభిమానులను మరింత ఉత్సాహపరిచే ఒక కీలక అప్డేట్ను అక్షయ్ స్వయంగా రివీల్ చేశారు. మంగళవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా అక్షయ్ కుమార్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘ఇప్పటివరకు చాలానే నవ్వించాం… ఇక అసలు క్రూరత్వం మొదలవుతుంది. ఈసారి మాత్రం ఎలాంటి జోకులు ఉండవు’ అంటూ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ పోస్ట్‌తో జూలై 15 రాత్రి 8 గంటలకు ‘హైవానియత్’ తొలి టీజర్ విడుదల కానుందని స్పష్టమైంది. దీంతో ఈ సైకో థ్రిల్లర్‌లో అక్షయ్ ఎలా కనిపించబోతున్నారో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇది అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో వస్తున్న ఎనిమిదో సినిమా. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చాలా చిత్రాలు కామెడీ ఎంటర్టైనర్లుగా ఘన విజయాలు సాధించాయి. అయితే ఈసారి పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుని ప్రేక్షకులను క్రేజీగా థ్రిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘హైవానియత్’లో అక్షయ్ కుమార్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు మళ్లీ ఒకే సినిమాలో కనిపించనుండటం విశేషం. గతంలో ‘మై ఖిలాడీ తు అనారీ’, ‘ఆర్జూ’, ‘తాషన్’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ జోడీ, ఇప్పుడు కొత్త తరహా థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించనుంది.
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ‘హైవానియత్’ మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఒప్పం’ నుంచి హిందీ రీమేక్‌గా తెరకెక్కుతోంది. మలయాళ వెర్షన్‌కు కూడా ప్రియదర్శనే దర్శకత్వం వహించగా, అందులో మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు అదే దర్శకుడు హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథను కొత్తగా మలుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘భూత్ బంగ్లా’, ‘వెల్కమ్ టు ది జంగిల్’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్, ‘హైవానియత్’తో తనలోని మరో నటుడిని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. సైకో థ్రిల్లర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈరోజు విడుదలయ్యే టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతుందా లేదా అన్నది చూడాలి.
Kal, raat 8 baje.
Aur iss baar, mazaak nahi hoga.#Haiwaan pic.twitter.com/5q8S05jsjM— Akshay Kumar (@akshaykumar) July 14, 2026
- Tags
- Akshay Kumar
- cinema
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!