Sangareddy: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో భార్యను భర్త హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కేఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకట బ్రహ్మం అనే వ్యక్తి తన భార్య కృష్ణవేణిని ఈ రోజు ఉదయం బ్యాట్‌తో కొట్టి హత్య చేశాడు.. కృష్ణవేణి కోహీర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త వెంకట బ్రహ్మం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు ఇంటర్మీడియట్ చదువుతుండగా, కుమారుడు ఎనిమిదో తరగతి విద్యార్థి.
Girl Death Mystery: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 4వ తేదీన జరిగిన చిన్నారి రంజిత అనుమానాస్పద మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించారు.
Hyderabad: డ్రగ్స్ ఓవర్ డోస్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. పాత బస్తీ కాళాపత్తర్ కు చెంది అహ్మద్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి శివరాంపల్లి కెన్ వర్త్ అపార్ట్మెంట్ లో కో రిలేషన్ లో ఉంటున్నారు. రాత్రి డ్రగ్స్ కొనుగోలు చేసి రూమ్ లో సేవించారు. అహ్మద్ మృతి చెందాడు. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. యువతిని ఆసుపత్రికి తరలించారు. రూమ్ లో నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.…
Hyderabad Drug Bust: ముషీరాబాద్‌లో డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ డెన్ బయటపడింది.. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు.. ముగ్గురు మిత్రులతో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు డాక్టర్ జాన్ పాల్.. ఢిల్లీ బెంగళూరు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నాడు. ప్రమోద్, సందీప్, శరత్ స్నేహితులతో కలిసి డ్రగ్స్‌ను తెప్పించుకున్నాడు. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో సోదాలు చేయగా ఓజి కుష్, ఎండిఎంఎ, ఎల్ఎస్డీ బాస్ట్స్, కొకైన్,…
Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు మూడు ప్రాణాలను బలి తీసుకున్నాయి. మండల కేంద్రంలో నివసిస్తున్న యాదయ్య అనే వ్యక్తి తన భార్య, కూతురు, వదినను కిరాతకంగా హత్య చేసి, చివరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణ హత్య కేసు వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్త ప్రాణాలు తీసింది. జిల్లా కేంద్రంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. భార్య నాగమణి శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత బంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య భర్త ఎందుకు? అని నాగమణి భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
Karimnagar: కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం రంగపేటలో వడ్ల దొంగతనం కలకలం రేపింది. రంగపేట ఐకేపీ సెంటర్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు దొంగలు వడ్ల సంచులు దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. టాటా ఏసీ వాహనంలో సుమారు 20 వడ్ల సంచులు ఎక్కిస్తున్న సమయంలో రైతులు అప్రమత్తమయ్యారు. తక్షణమే అక్కడికెళ్లిన రైతులు దొంగలను అడ్డుకున్నారు. ఆ సమయంలో ఒక దొంగను పట్టుకుని గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Newlywed Woman Suicide in Vikarabad: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధి కోస్గి మండలం పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే కాటికి చేరింది. చంద్రవంచ గ్రామానికి చెందిన నవవధువు గొల్ల శ్రీలత(21) పెళ్ళైన మూడు రోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది..
Warangal: వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమవిఫలమవ్వడంతో చెన్నరావుపేట మండలం ధర్మతండాకు చెందిన మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం మిగిలించింది. తాను ప్రేమించిన యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న మహేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనకు ప్రేమించిన అమ్మాయితో వివాహం జరగదని తేలడంతో మానసికంగా కుంగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Medchal: మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం గోరక్షక్ సభ్యుడు ప్రశాంత్ అలియాస్ సోనుపై కాల్పులు జరిగాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. కీసర మండలం రాంపల్లికి చెందిన సోను గోవుల తరలింపు విషయంలో అడ్డుపడుతున్నాడని బహదూర్‌పురాకు చెందిన ఇబ్రహీం చౌదరి అనే వ్యక్తి పోచారం పోలీస్ స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిచినట్లు సమాచారం. ప్రశాంత్ అలియాస్ సోనుకి గోవుల తరలింపు సమాచారం…