ఏ పార్టీకైనా అధికార ప్రతినిధులు బలం. విమర్శలు వచ్చినా.. సమస్యలపై స్పందించాలన్నా.. వాళ్ల పాత్ర కీలకం. కానీ.. ఆ జాతీయపార్టీలో స్పోక్పర్సన్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు లేవట. డజను మందికిపైగా అధికార ప్రతినిధులున్నా పార్టీ వాయిస్ లేదు..! తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చాక వేసిన పార్టీ పదవులు అధికార ప్రతినిధుల పోస్టులే. పార్టీకి అధికార ప్రతినిధుల పాత్ర కీలకమని భావించి వాటిని ప్రకటించారు. కాంగ్రెస్ వాయిస్ వినిపించడం.. సమస్యలపై పూర్తి అవగాహనతో స్పందిస్తారని…
తెలంగాణ కాంగ్రెస్ .. ఏపీ కాంగ్రెస్‌కి అప్పు పడిందా..!? పాత బకాయిని వసూలు చేసుకునే పనిలో ఏపీ నేతలు ఉన్నారా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీసీసీకి ఆ మొత్తం ఇప్పుడు చాలా అంటే చాలా అవసరమా? ఇంతకీ టీపీసీసీ చెల్లించాల్సిన అప్పు ఎంత? టీపీసీసీ, ఏపీసీసీ మధ్య అప్పుపై కాంగ్రెస్‌లో చర్చ..! తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీల మధ్య ప్రస్తుతం అప్పు పంచాయితీ నడుస్తోంది. అదీ 2014 నుంచీ వసూలు కాకుండా ఉండిపోయిన అప్పుగా చెబుతున్నాయి పార్టీ…
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నారా? జిల్లాలకు కొత్త నాయకత్వం రాబోతుందా? పీసీసీ చీఫ్ ఆలోచనేంటి? ఉన్న వాళ్లందరినీ మర్చేస్తారా? పదవులను కట్టబెట్టేందుకు ప్రామాణికంగా భావిస్తున్న అంశాలేంటి? జనవరి నుంచి జిల్లాల వారీగా సమీక్షలు..! తెలంగాణ కాంగ్రెస్‌కి పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై ఎక్కువ చర్చ జరిగింది. ఎవరెవరు టీంలో ఉంటారు. ఎవరిని బయటకు పంపిస్తారు అని ఆరా తీశారు. రేవంత్ భారీ సభలు.. కార్యక్రమాలపై ఫోకస్ పెట్టడంతో రాష్ట్ర…
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. నాయకుల మధ్య ఉన్న విభేదాలను మరోసారి భగ్గుమనేలా చేసింది. ఓటమికి గల కారణాలపై చర్చించేందుకు ఢిల్లీకి పిలిచిన అధిష్టానం, తెలంగాణ నాయకులతో వార్‌రూమ్‌లో సుధీర్ఘంగా చర్చించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక దానికి ముందూ, వెనుకా జరిగిన పరిణామాలన్నింటిపైనా ఆరా తీసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముందు జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పంచాయితీలో టీ.కాంగ్ నేతలు ఉత్తమ్, రేవంత్ వర్గాలుగా విడిపోయారు. ఓటమికి…
కాంగ్రెస్ వార్ రూమ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతల పోటికల్ వార్ జరిగింది. రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ నేతలు… ఓ పక్క రేవంత్ వర్గం … మరోవైపు ఉత్తమ్ వర్గంగా చీలారు నేతలు. పొన్నం ప్రభాకర్… ఉత్తమ్ మద్య మాటల యుద్ధం జరిగింది. కొందరు తెరాసకి కోవర్తులుగా పని చేశారన్నారు పొన్నం. కౌశిక్ రెడ్డీని పెంచి పోషించింది ఉత్తమ్. ఈటల ఎపిసోడ్ లో పార్టీ స్టాండ్ ఏంటని ఉత్తమ్ నీ అడిగా ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు.…
తెలంగాణలో పూర్వ వైభవం తెచ్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. 2014 తర్వాత పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ఈమధ్యే జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయింది భారత జాతీయ కాంగ్రెస్. పార్టీ క్యాడర్ లో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 14 నుండి 21 వరకు ఎన్నికల కోడ్ లోబడే.. కాంగ్రెస్ జన జాగరణ ప్రజా చైతన్య పాదయాత్ర లు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ ల పర్మిషన్ లు…
తెలంగాణలో జరిగిన ఒక ఉప ఎన్నిక జాతీయ పార్టీ కాంగ్రెస్ ని కుదిపేస్తోంది. పార్టీ పరాజయం నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గత నెల 30 జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి అక్కడ డిపాజిట్లు గల్లంతయ్యాయి. పార్టీ పరువు పోయిందని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు సైతం ఎన్నికల ఫలితాల తర్వాత పోస్టుమార్టం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వెయ్యం…
ఆయన సైకిల్ దిగి కమలదళంలో చేరారు. అక్కడా ఇమడలేక బయటకొచ్చేశారు ఆ మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైనా.. ఎవరో అడ్డుపుల్ల వేశారట. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన్ని అడ్డుకుంటోంది ఎవరు? 12న కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు? మరాఠి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే. మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు. బీజేపీకి గుడ్‌బై చెప్పాక.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే నిరుద్యోగ…
హుజూరాబాద్ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అన్న రీతిలో దూసుకెళుతున్నాయి. ఎవరికీవారు తగ్గెదేలే అన్నట్లుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇంకా మైదానంలోకి దిగనట్లే కన్పిస్తోంది. పోలింగ్ తేదికి మరో 23రోజులే ఉన్నా కాంగ్రెస్ మాత్రం జోరు చూపించడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఆపార్టీ నేతలతీరు ఉంది. దీంతో అసలు కాంగ్రెస్ రేసులో ఉందా? లేదంటే సైడ్ అయిందా?…
అధికారంలో ఉన్నప్పుడు వారంతా చక్రం తిప్పారు. పైగా పార్టీలో సీనియర్లు. ప్రస్తుతం అనేక సవాళ్లు ఆహ్వానిస్తున్నా.. చప్పుడు చేయరు. హుజురాబాద్ ఉపఎన్నికపైనా నాన్చుడే. అన్నింటికీ తామే అని చెప్పే నేతలు..ఈ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? హుజురాబాద్‌ను పీసీసీ చీఫ్ సీరియస్‌గా తీసుకున్నారా లేదా? హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ప్రచార హోరులో కాంగ్రెస్ జెండా కనిపించడం లేదు. ఇంకా పాత కాలపు ఎత్తుగడలే. హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించడానికీ కాంగ్రెస్ నానా తంటాలు పడుతుంది. కొండా సురేఖ…