Bhongir MP Komatireddy Venkat Reddy about Telangana Congress
తెలంగాణ కాంగ్రెస్ ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. అయితే టీకాంగ్రెస్ పోరు ఇప్పుడు బయట పడడంతో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న కొట్లాటలుంటాయని, అన్నీ సర్దుకుంటాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారే ప్రసక్తి లేదని, నేను పార్టీ మారుతున్నాననే ప్రచారాన్ని ఖండిస్తున్నానని ఆయన అన్నారు. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు సహజమని, కుటుంబంలో భిన్నాభిప్రాయాలున్నట్లే కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలయని ఆయన వ్యాఖ్యానించారు. సహజం .
త్వరలోనే సర్జుకు పోతాయని, ప్రగతి భవన్‌లో విభేదాల గురించి మీడియా రాయదని, కాంగ్రెస్‌కు సొంత మీడియా, డబ్బులు లేవు కాబట్టే వ్యతిరేకంగా రాస్తారని, అభివృద్ధి పనుల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను గతంలో కలిశాను. భవిష్యత్తులో కూడా కలుస్తానన్నారు. 600 కోట్ల రూపాయల ప్రగతి భవన్, కేసీఆర్ 600 కోట్ల రూపాయల ఫౌం హౌజ్ చుట్టూ రింగ్ రోడ్లు వేయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 3 వేల కోట్ల రూపాయలను కేటాయించి మూసీ ప్రక్షాళన చేయాలని ప్రధానిని కోరానని, తెలంగాణలో వరిధాన్యానికి మద్దతు ధర పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నానన్నారు.