Smita sabharwal: తెలంగాణ సీఎంఓ సెక్రటరీ, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తరచూ ట్విట్టర్‌లో ఏదో ఒక అంశంపై పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల వీడియోను ఆమె రీట్వీట్ చేశారు.
రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ఎత్తుగడలు సహజం. ఎప్పుడు ఏం అంశం కీలకమవుతుందో ఊహించలేం. ఎప్పుడెలా పరిష్కారం లభిస్తుందో చెప్పలేం. ఆ విధంగా చర్చల్లోకి వచ్చిందే తెలంగాణ CMO. ఒక్క దళిత అధికారి కూడా లేరన్న విపక్షాల విమర్శలకు విరుగుడు మంత్రం వేసింది అధికారపక్షం. అదేంటో ఈస్టోరీలో చూద్దాం. సీఎంవోపై విమర్శలకు ప్రభుత్వం విరుగుడు మంత్రం! హుజురాబాద్ ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాల్లో అనేక అంశాలు చర్చల్లోకి వస్తున్నాయి. సమయం.. సందర్భాన్ని బట్టి ప్రత్యర్థులను ఇరుకున…