CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నగరంలో అభివృద్ధి అంశంపై కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులనే ప్రస్తావిస్తూ, గత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరంలో ట్యాంక్ బండ్, శిల్పారామం, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి పట్ల పలు విమర్శలు వ్యక్తం చేస్తూ, సిటీలో కనీస డ్రైనేజీ వ్యవస్థ కూడా పూరణ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. HYDRA :…
CM Revanth Reddy : ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ విభాగం పరిధిలో రూ.5827 కోట్ల తో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో HCITI ఫేజ్-1లో రూ.3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఈ పనులకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు ₹150…
హన్మకొండ ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఉక్కు మహిళ అని కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని ఉక్కు సంకల్పంతో ఉన్నామని, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను సీఎం అయ్యానని ఆయన అన్నారు.
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదన్నారు. సీఎం రేవంత్‌ని వ్యతిరేకించిన అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు... ఆ విషయం తెలుసు అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ నెల 20 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని వేములవాడ పట్టణాభివృద్ధికి వరాల జల్లు కురిపించనున్నారు. అదే రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే.. నేడు ఏడో రోజు వైభవోపేతంగా జరగుతున్న కోటి దీపోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సాగిన పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి.. భీమలింగంకు పూజలు చేశారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం, సంగెం గ్రామం నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా, సంగెం - భీమలింగం - ధర్మారెడ్డిపల్లి కెనాల్ - నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల మేర నడిచేలా సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని రూపొందించారు.
దశాబ్దాలుగా మూసీ నదిపై కాంగ్రెస్ దీర్ఘకాల నిర్లక్ష్యం, పునరుజ్జీవన ప్రాజెక్టు బాధితుల బాధల నుంచి దృష్టి మరల్చేందుకు నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన మూసీ పాదయాత్ర రాజకీయ స్టంట్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అభివర్ణించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చే ప్రమాదంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.
Gussadi Kanakaraj: గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన కనకరాజు అసామాన్యుడు.. ఆయన మరణం తీరని లోటని తెలిపారు.