భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఎన్టీఆర్ స్టేడియం అపూర్వమైన ఆధ్యాత్మిక కాంతులతో మిన్నంటింది. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం శివభక్తి జ్యోతులతో నిండిపోగా, భక్తి, ఆరాధనలతో నిండిన ఆ వాతావరణం ప్రతి భక్తుడి మనసును మైమరిపించింది. కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీలు ప్రతీ ఏటా నిర్వహించే ఈ మహోత్సవం, ఈసారి మరింత వైభవంగా, మహిమాన్వితంగా సాగుతోంది. ఈ…
CM Revanth Reddy: 2040 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కళ్యాణ్‌నగర్ టీజీ జెన్కో ఆడిటోరియంలో ప్రముఖ కవి అందేశ్రీ రచించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కవులకు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ అని అన్నారు. ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తిగా గూడ అంజన్న, దశరథి, కాళోజీ, అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న లాంటి కవులు నిలిచారని గుర్తు చేశారు. తనపై తనకు…
జర్నలిజం డెఫినేషన్ మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జర్నలిజం వృత్తిలో ఉన్నవాళ్లు తమ బాధ్యతను మరవకూడదన్నారు. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్నా వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను వేరే చేయాలని.. వాళ్లను వేరుగా కూర్చోబెట్టాలని పాత్రికేయులకు సీఎం విజ్ఞప్తి చేశారు. వాళ్లు, మీరు ఒక్కటి కాదన్న భావనను ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రావాలని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండని కోరారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. ఏ రోజు తాను సీఎంగా అహంకారానికి పోలేదని చెప్పారు. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తామని.. ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని తెలిపారు. సంగారెడ్డి…