తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ ఇబ్బంది పడుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట కోసం సోనియగాంధీ తెలంగాణ ఇచ్చారు అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టారు కేసీఆర్. తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి పరిమితం అయ్యింది.
రాష్ట్రంలో వర్షాలు పడ్డాయి .. తెలంగాణలో సాగు పెరిగింది. కేసీఆర్ కొత్తగా నీళ్ళు ఇచ్చి… సాగు లోకి వచ్చింది లేదు. నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కమిషన్ల కోసమే మిషన్ భగీరథ… ప్రాజెక్టులు ప్రారంభించారు. 50 వేల ఉద్యోగాలు ఇస్తా అన్నారు… నోటిఫికేషన్ ఏదీ అని అడిగారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఫార్మ్ హౌస్ బాగుంది. ప్రగతి భవన్ బాగుంది. కొత్త సెక్రటేరియట్ వస్తె కానీ అడుగులు వేయరట. వరంగల్ కి వెళ్లి జైల్ కి వెళ్ళారు కేసీఆర్. కానీ ఆయన ఆఖరికి వెళ్ళేది జైల్ కే అని పేర్కొన పొన్నాల… నేను కేసీఆర్ చర్లపల్లి జైల్ కి వెళ్తారు అనుకున్న ..కానీ వరంగల్ లో కొత్త జైల్ కట్టుకుంటున్నారు అని అన్నారు.