Cabinet Meeting: ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం, అధికారులు మేడారం రానున్నారు. వన దేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీ కానుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4:30 ని.లకు ముఖ్యమంత్రి, మంత్రులు మేడారం చేరుకోనున్నారు. 5 గంటలకు మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసి ఆచారసాంప్రదాయాల ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలుకుతారు. 5PM టూ 6:30PM వరకు హరిత హోటల్ ప్రాంగణంలో మంత్రివర్గం భేటీ కానుంది.