Azharuddin : తెలంగాణ కేబినెట్‌లోకి మాజీ భారత క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ రానున్నారు. ఎల్లుండి ఆయన మంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అజారుద్దీన్, తనకు ఇచ్చిన అవకాశంపై కృతజ్ఞతలు తెలిపారు.
Kantara Chapter 1 : ‘కాంతార చాప్టర్ 1’ 1000 కోట్ల మార్క్‌ను అడ్డుకున్న నిర్మాతలు?
పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తానని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అజారుద్దీన్ మంత్రి పదవిలోకి రావడం ద్వారా ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ స్థాయిలో కొత్త ఉత్సాహం నెలకొనే అవకాశముంది. ఓల్డ్ సిటీ ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు, మైనార్టీ వర్గాల మద్దతును బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. ప్రముఖ క్రికెటర్‌గా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అజారుద్దీన్ 2019లో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు స్వీకరించనున్నారు.
Team India: విరాట్ కంటే మొనగాడు లేడు.. టాప్-5 వన్డే బ్యాటర్ల లిస్ట్ ఇదే!