Telangana Assembly 2024: నేడు అసెంబ్లీలో మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చ..
- నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగింపు..
- ఇవాళ అసెంబ్లీలో మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చ..
- ధరణి- హైదరాబాద్ అభివృద్ధి- జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly 2024: నేడు తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ముఖ్యంగా మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చించనున్నారు. ధరణి పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు. అంతేకాకుండా.. త్వరలో ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.30కు మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవనున్నారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇటీవల పదోన్నతి పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం..ఎల్బీ స్టేడియంలో భారీ సభలో ప్రసంగించనున్నారు.
Read also: Astrology: ఆగస్టు 02, శుక్రవారం దినఫలాలు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ఇవాళ అసెంబ్లీలో ఉద్యోగాల క్యాలెండర్‌ను ప్రకటిస్తామని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. అలాగే ప్రజలకు తెల్ల రేషన్‌కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని తెలిపారు. రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. క్రీడాకారులు ఈషాసింగ్, నిఖత్ జరీన్, సిరాజ్‌లకు ఒక్కొక్కరికి 600 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
కాగా.. హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. అందుకు కీలకమైన చర్యలు తీసుకోనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లతో పాటు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద నాలుగో నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి జులై 31 అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర విస్తరణపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో తీర్మానంపై చర్చ జరగనుంది.
Off The Record : అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది..?
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!