Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. దీంతో హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది ఇప్పటికే డీఆర్సీ కేంద్రాలకు చేరుకున్నారు. వారికి అధికారులు ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అందజేస్తున్నారు. సామాగ్రిని తీసుకుని ఇవాళ సాయంత్రంలోగా సిబ్బంది తమ తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి…
Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.. మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారానికి తెరపడింది.. ఇప్పుడు ప్రలోభాల పర్వం జోరుగా సాగుతున్నట్టు కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతోంది.. గురువారం రోజు పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఎన్నికల ఫలితాలపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయట.. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కోట్ల రూపాయలు పందెం…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లలో కనివిని ఎరుగని రీతిలో చర్యలు చేపట్టింది. ఎంత వ్యయమైనా సరే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిపేందుకు ప్రాధాన్యత ఇచ్చింది.
అమర వీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నక్క లాగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ చేతిలో తెలంగాణ ప్రజలు పడకూడదని, కుటుంబ, అవినీతి, అహంకార పార్టీలు తెలంగాణకు అవసరం లేదన్నారు. అబద్ధాలు, మోసాలు, కుట్రలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎవరు నెరవేరుస్తారో గుర్తించారు.. కాబట్టే బీజేపీకి రోజు రోజుకూ…
కేటీఆర్ ఒక బచ్చ.. కాకా కృషిపై సోయి లేక మాట్లాడుతుండని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం చెన్నూరులో ప్రచారం నిర్వహించిన వివేక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెన్నూరూలో కాకా ఫ్యామిలీ ఏం చేసిందని కేటీఆర్ మాట్లాడుతుండని మండిపడ్డారు. కేటీఆర్ ఒక బచ్చ.. తెలంగాణ ఉద్యమం ఎట్ల ప్రారంభమైంది, కాకా కృషి ఏందని సోయి లేక మాట్లాడుతుండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాకా వెంకటస్వామి తెలంగాణ వాది.. 1969లో తూటా దెబ్బలు తిన్నడు. ఉద్యమం కోసం…
Rahul Gandhi: ఈఎస్‌ఐ, పీఎఫ్ అందించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ కోరారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
Telangana Election 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు నేడు పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేయనున్నారు.
CM KCR: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారంతో ముగియనుంది. ఓటింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్నికల ప్రచారం సీఎల్పీ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి భట్టి విక్రమార్క్ మరో ముందడుగు వేశారు. సోమవారం ఖమ్మంలో ప్రచారం చేపట్టిన భట్టి ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. ఈ ప్రచారంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చొప్పికట్లపాలెంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రమాణం చేశారు. అవినీతి రహితంగా వ్యవహరిస్తానని ఆంజనేయస్వామి ఎదుట ప్రమాణం చేశారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. ‘రైతుబంధు ఆపింది కాంగ్రెసేనంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘రైతులను కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలే మోసం…
ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకోవడంతో అంబర్పేట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ తన ప్రచారoలో స్పీడ్ పెంచారు. సోమవారం అంబర్పేట్ డివిజన్ ప్రేమ్నగర్తో పాటు పలు బస్తిలలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పథకాలను వివరించారు. పేద మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పథకం పేరిట నెలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని తెలిపారు. ఓటర్లు ఎక్కడకు వెళ్లిన పూల వర్షం కురిపిస్తూ మంగళ…