Vivek Venkataswamy: కేటీఆర్ ఒక బచ్చ.. కాకా కృషిపై సోయి లేక మాట్లాడుతుండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ ఒక బచ్చ.. కాకా కృషిపై సోయి లేక మాట్లాడుతుండని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం చెన్నూరులో ప్రచారం నిర్వహించిన వివేక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెన్నూరూలో కాకా ఫ్యామిలీ ఏం చేసిందని కేటీఆర్ మాట్లాడుతుండని మండిపడ్డారు. కేటీఆర్ ఒక బచ్చ.. తెలంగాణ ఉద్యమం ఎట్ల ప్రారంభమైంది, కాకా కృషి ఏందని సోయి లేక మాట్లాడుతుండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాకా వెంకటస్వామి తెలంగాణ వాది.. 1969లో తూటా దెబ్బలు తిన్నడు. ఉద్యమం కోసం ఆనాడు డబ్ల్యూసీ సమావేశానికి హాజరు కాలేదు.
2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు కోసం కేసిఆర్ కాకా దగ్గరికి వచ్చిండు. వెంకటస్వామి కృషితోనే పొత్తు కుదిరింది. 2013లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తిని నేను. నేను కాంగ్రెస్ నుంచి టీఆఆర్ఎస్‌లోకి పోవడంతోనే సోనియాగాంధీ తెలంగాణ ఆకాంక్షను గుర్తించారు. సిరిసిల్ల ఉద్యమంలో పోరాడిన కేకే మహీందర్ రెడ్డి సీటును 2009లో కేటీఆర్ కబ్జా చేసిండు. తెలంగాణ ఉద్యోమం సమయంలో కేసీఆర్ దగ్గర రూపాయి లేదు. ఏదైతే సూట్‌కేసు అంటున్నాడో.. అది నేనే కేసీఆర్‌కు ఇచ్చిన కాకా కుటుంబంతోనే కేసీఆర్ లాభ పడింది. చెన్నూరు పై అవగాహన లేక ktr మాట్లాడిండు’ అని అన్నారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అలాగే ‘కేటీఆర్, బాల్క సుమన్ ప్రగతి భవన్‌లో జల్సాలు చేస్తున్నారు. అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబం, సుమన్‌కు అలవాటైంది. చెన్నూరు రూపు రేఖలు మారలేదు సుమన్ రూపు రేఖలు మారినై కల్వకుంట్ల కుటుంబం సుమన్ కలసి చెన్నూరు లో దోపిడీ చేసిర్రు. ఇసుక దందా కోసమే బ్రిడ్జి లు రోడ్లు వేసిండు అదే నా అభివృద్ధి. కేసీఆర్ రిటైర్డ్ మెంట్ తీస్కునక KTR ఆశ పడుతుండు ముఖ్యమంత్రి అవుతానని. Ktr కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ ప్రాజెక్టు అని ఒప్పుకున్నాడు అందుకే కర కట్ట కడ్త అంటుండు. కేటీఆర్, సుమన్ మాట మాట్లాడితే.. సూట్‌కేసులు అంటూ నాపై ఆరోపణ చేస్తున్నారు. నేను ఒక పారిశ్రామిక వేత్తను 10 వేల కోట్లు ట్యాక్స్ కట్టిన.
సుమన్‌కు ప్రమోషన్ కాదు నువ్వు ఒడిపోతున్నావ్. కేసీఆర్ ఓడిపోతుండు సుమన్ ఒడిపోతుండు. ప్రజల సొమ్మును జాతీయ నాయకత్వం కోసం వృధా చేశావ్. కేసీఆర్,కేటీఆర్, సుమన్ అవినీతి అక్రమాలపై విచారణ చేసి జైలుకు పంపడం తప్పదు. తప్పుడు ఆరోపణతో రైడ్ చేసి ప్రెస్‌నోట్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత దర్యాప్తు సంస్థపై పరువునష్టం దావా వేస్తా. కాళేశ్వరంపై హై పవర్ టీంతో రివ్యూ చేయించి పరిష్కారం చూపిస్తాం. ఎక్కువ భూములు ఉండి వ్యవసాయం చేయని వాళ్లకు రైతుబంధ్ ఇవ్వడం అవసరమా? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుబంధుపై రివ్యూ చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!