Telangana Elections: చెదురుముదురు సంఘటనల మినహా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు కదులుతున్నారు.
Badradri: తెలంగాణ ఎన్నికల వేళ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో 25 మంది వ్యాపార వేత్తలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు సహకరిస్తే చంపేస్తామని వారిని హెచ్చరించారు.
Election Ink: ఎన్నికలలో సిరా చుక్క చాలా ముఖ్యమైన అంశం. సిరా చుక్క ఓటేశాం అని చెప్పేందుకు గుర్తుగానే కాదు.. నకిలీ ఓట్లను అరికట్టేందుకు, ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తుపెట్టుకునేందుకు భారత ఎన్నికల సంఘం దశాబ్దాలుగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది.
Telangana Elections : కొన్ని దేశాల్లో ఎన్నికల్లో ఓటు వేయని వారికి జరిమానా విధిస్తారు. మరికొన్ని దేశాల్లో ఏకంగా వారిని నేరస్తులుగా పరిగణించి శిక్షిస్తున్నారు. ఆస్ట్రేలియాలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి.
Telangana Elections : వరంగల్ జిల్లా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు రెండు కాళ్లు పోయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో పనిచేస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందటే ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు.
Telangana Assembly Elections 2023 : నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కు పొంది తొలిసారిగా ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు యువ ఓటర్లు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Telangana Elections : ప్రజాస్వామ్యంలో ఓటు ప్రతి ఒక్కరి హక్కు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ల ఓటు వాళ్లే వేసుకుంటారు. కానీ సీఎం కేసీఆర్ కు ఆ ఛాన్స్ లేదు. ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ ఆయనకు ఓటు లేదు. కానీ సిద్ధిపేట జిల్లాలోని చింతమడకలో తనకు ఓటు ఉంది.
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పలువురు సీఎం కేసీఆర్‌తో పాటు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇందుకోసం నేతలంతా తమ సొంత నియోజకవర్గాలకు పయనమయ్యారు. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం 9 గంటలకు తన స్వగ్రామం చింతమడకలో ఓటు వేయనున్నారు. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్లోని జెడ్‌పీహెచ్ఎస్ పోలింగ్ బూతులో ఓటు వేస్తారు. కోరుట్లలో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగ రావు, మెట్‌పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్,…
Hyderabad: తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రేపు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలింగ్ శాతం పెంచేందుకు స్కూల్స్, కాలేజీలతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా ఈసీ సెలవులు ప్రకటించింది. అలాగే రేపు నగరంలోని పార్కులు కూడా మూతపడనున్నాయి. రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పార్కులు బంద్ కానున్నాయి. జంట నగరాలలోని అన్ని పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. రేపు పోలింగ్ సందర్భంగా…
దీక్ష దీవాస్ పేరుతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత సీఈఓకు ఫీర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కేటీఆర్ దీక్ష దివాస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే.. అందుకే సీఈఓకి ఫిర్యాదు చేశామన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా? అనే అనుమానం కలుగుతోంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి సైలెన్స్ పిరియాడ్ కొనసాగుతోంది. ఎన్నికలకు సంబంధించి…