Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. దీంతో హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది ఇప్పటికే డీఆర్సీ కేంద్రాలకు చేరుకున్నారు. వారికి అధికారులు ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అందజేస్తున్నారు. సామాగ్రిని తీసుకుని ఇవాళ సాయంత్రంలోగా సిబ్బంది తమ తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 35, 655 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఎన్నికల పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్వాడ్లను ఎన్నికల కమిషన్ నియమించుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో దాదాపు 1.85 లక్షల మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నట్టు సమాచారం.