Hyderabad: తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రేపు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలింగ్ శాతం పెంచేందుకు స్కూల్స్, కాలేజీలతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా ఈసీ సెలవులు ప్రకటించింది. అలాగే రేపు నగరంలోని పార్కులు కూడా మూతపడనున్నాయి. రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పార్కులు బంద్ కానున్నాయి. జంట నగరాలలోని అన్ని పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. రేపు పోలింగ్ సందర్భంగా క్లోజ్ చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు వెల్లడించారు.