Kaleshwaram Report: శాసన సభలో కాళేశ్వరం కమిషన్‌పై చర్చ మొదలైంది. ఈసందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 650 పేజీల పుస్తకం ఇచ్చి అరగంట మాట్లాడాలి అంటే ఎలా అని ప్రశ్నించారు. వరదలు, యూరియా కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలపై చర్చిద్దామని బీఏసీలో కోరామని, వరద సమస్య ముఖ్యం కాదని ప్రభుత్వం అనుకుందని చెప్పారు. కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ…
ఈ రోజు చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై చెత్త వాగుడు వాగారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నువ్వు గజినీవి.. నీ చుట్టూ ఉన్నది చెత్త బ్యాచ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిట్‌చాట్ లో హరీష్ మాట్లాడారు. బనకచర్ల పై రేవంత్ రెడ్డి బాగోతం నగ్నంగా బయట పడిందన్నారు. ఆయన చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
Harish Rao : ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సభ తొలి క్షణాల్లోనే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలతో సమావేశాలను ఆరంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై చర్చల్లో విపక్ష సభ్యుడు హరీశ్ రావు మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌లో నీతి పాఠాలు చెప్పడంలో బాగా రాణించారని వ్యంగ్యంగా అన్నారు. గత ఏడాది బడ్జెట్‌తో పోల్చుతూ అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. గతంలో బడ్జెట్ అంచనాలను అతిగా పెంచి చూపించారని, ఈసారి మాత్రం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేఖ ద్వారా సవాల్ విసిరారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా తన మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తోందని లేఖలో తెలిపారు.