Kaleshwaram Report: కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధం: హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Report: శాసన సభలో కాళేశ్వరం కమిషన్‌పై చర్చ మొదలైంది. ఈసందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 650 పేజీల పుస్తకం ఇచ్చి అరగంట మాట్లాడాలి అంటే ఎలా అని ప్రశ్నించారు. వరదలు, యూరియా కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలపై చర్చిద్దామని బీఏసీలో కోరామని, వరద సమస్య ముఖ్యం కాదని ప్రభుత్వం అనుకుందని చెప్పారు. కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు, తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, క్రాస్ ఎగ్జామినేషన్‌కు కూడా నోటీసులు ఇవ్వలేదని, ఘోష్ కమిషన్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. కమిషన్లను రాజకీయ ఆయుధాలుగా వాడుకోవద్దని కోర్టులు గతంలోనే చెప్పాయని గుర్తు చేశారు. నిబంధనలు అనుసరించలేదనే కోర్టుకు వెళ్లామని చెప్పారు. ఆదివారం రిపోర్ట్ పెట్టారంటేనే కుట్ర ఉన్నట్లు, అందుకే సుప్రీంకోర్టులో సీఎం కేవియేట్ వేశారని అన్నారు. కోర్టులో వాదనలు ఉన్నాయనే ఆదివారం కూడా చర్చ పెట్టారు, పారదర్శకంగా విచారణ జరగకపోతే అవి చిత్తు కాగితంతో సమానమని కోర్టులు చెప్పాయని గుర్తు చేశారు.
READ ALSO: Ram Charan : రామ్ చరణ్ కు సీఎం ఆత్మీయ సన్మానం
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
వాస్తవాలు ప్రజలకు తెలియాలని, నాలుగు రోజులైన చర్చ చేస్తామని చెప్పారు. కానీ అరగంట సమయం ఇస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు ప్రభుత్వం నడుపుతున్నారా… సర్కస్ నడుపుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. 1952 యాక్ట్ రక్షణ ఉందని, శాసన సభ్యుడి మీద ఆరోపణలు చేయాలంటే…సభ్యుడికి నోటీస్ ఇవ్వాలని అన్నారు. మేడిగడ్డలో లోపం లేక ముందే తప్పుడు ఆరోపణలు చేసిందని, ఘోష్ కమీషన్ రాజ్యంగా ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. తమకు 8 b కింద నోటీస్ లు ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఆనాడు షా కమిషన్ ఇందిరాగాంధీకి 8B కింద నోటీసులు ఇచ్చింది. అయినా ఇందిరాగాంధీ కోర్టుకు వెళ్తే షా కమిషన్‌ను కొట్టివేసిందన్నారు. LK అద్వానీపై కమిషన్ వేస్తే అన్యాయమని బీజేపీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది. ప్రోసీజర్ అనుసరించలేదని ఆనాడు లిబ్రహాన్ కమిషన్‌ను కోర్టు కోట్టివేసింది. రిపోర్టును క్వాష్ చేయాలనే మేం కోర్టుకు వెళ్లాం. సభలో చర్చ చేయొద్దని కోర్టుకు వెళ్లలేదని చెప్పారు.
READ ALSO: Kadiyam Srihari : దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తి దిశగా కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..