ఈ రోజు చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై చెత్త వాగుడు వాగారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నువ్వు గజినీవి.. నీ చుట్టూ ఉన్నది చెత్త బ్యాచ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిట్‌చాట్ లో హరీష్ మాట్లాడారు. బనకచర్ల పై రేవంత్ రెడ్డి బాగోతం నగ్నంగా బయట పడిందన్నారు. ఆయన చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ గంజాయి అని మోకాలుకు బోడగుండుకు ముడి పెడుతున్నారన్నారు. జై తెలంగాణ ఎందుకు అనడం లేదు అనే దానికి పార్టీకి ముడి పెడుతున్నారని చెప్పారు. మీ రాహుల్ గాంధీ, ఖర్గేలు కూడా జై తెలంగాణ అంటున్నారని తెలిపారు. నువ్వు ఎందుకు అనట్లేదని ప్రశ్నించారు. మీరు మీ చుట్టూ అంతా బ్యాగుల బ్యాచ్ ఉంటుందని.. పరిపాలన అంటే బ్యాగులు మోయడం కాదన్నారు. మీ పాలనలో రోజు ఒక పాఠశాలలో విద్యార్థి ఆసుపత్రుల పాలు అవుతున్నారని.. గ్రామాల్లో పట్టణాల్లో డీజిల్ డబ్బులు లేక పారిశుధ్యం పడకేసిందని ఆరోపించారు. రోజూ ప్రజలను కలుస్తాను అని చెప్పిన నువ్వు కలుస్తున్నవా? అని ప్రశ్నించారు.
“ఈరోజు ఆల్ ఇండియా రేడియోలో కూడా గోదావరి బనకచర్ల పై కమిటీ వేశారని చెప్పారు. కంపల్సివ్ లయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధి తో సీఎం బాధ పడుతున్నారు. అందుకే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మా కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధం అన్నారు. కానీ మీ దగ్గర విషయం లేక కేటీఆర్ తో చర్చకు రాను అంటున్నారు. అర్ధరాత్రి ప్రైవేటు కార్లలో వెళ్లి గోడలు దూకే అలవాటు రేవంత్ రెడ్డికి ఉంది. నీటి వినియోగానికి నీటి పంపకానికి తేడా తెలియదు కాబట్టి సీఎం అలా మాట్లాడుతున్నారు. 700 టీఎంసీల కోసం కొట్లాడుతుంటే 500 టీఎంసీలుచాలు అని సీఎం అంటున్నారు. తినే సొమ్ము తెలంగాణ ది.. పాడే పాట ఆంధ్రాది అనే విధంగా సీఎం తీరు ఉంది. నువ్వు ఏమి చేసినా నా అంత ఎత్తు పెరగలేవు… ఎన్ని చేసినా కేసీఆర్ స్థాయికి రాలేవు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు..” అని హరీష్‌రావు సవాల్ విసిరారు.
READ MORE: Heavy Rain Alert: అలర్ట్.. హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. మరో 2 గంటల్లో..
తమ ఎమ్మెల్యేల ఇంటి మీద దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో ఈడీ ఎందుకు రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేయట్లేదు? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని అడిగారు. ఏదైనా కేసులలో ఇరికిస్తే వెనక్కు తగ్గుతామ్ అనుకుంటున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా మేము వెనక్కు తగ్గమన్నారు. లోకేష్ ను చీకట్లో కలవాల్సిన అవసరం కేటీఆర్ లేదని స్పష్టం చేశారు.. తమ ఫోన్ లు రోజూ ట్యాప్ చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి మా ఫోన్ లను ట్యాప్ చేస్తూనే ఉన్నారని.. తనతో మాట్లాడుతున్నందుకు ఢిల్లీలో ఒక విలేఖరిని బెదిరించారన్నారు. ఆ విలేఖరి నాతో మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డికి ఎట్లా తెలుసు? అని ప్రశ్నించారు. ట్యాప్ చేస్తేనే కద తెలిసేదన్నారు.