Uttam Kumar Reddy : దేవాదుల ప్రాజెక్ట్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సోమవారం సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో తెలంగాణాలో ధాన్యం దిగుబడి రానుందనని తెలిపారు. దేశంలో తెలంగాణాలోనే ఎక్కువగా 148.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ధాన్యం కొనడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడానికి ఏర్పాట్లు…
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సరైన ముందుచూపు లేదని ఆయన ఆరోపించారు.
Minister Seethakka : ములుగు జిల్లా మంజీరా ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క రైతులకు ఆయిల్ ఫార్మ్ పంట ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఆయిల్ ఫార్మ్ సాగుతో రైతులు మంచి లాభాలు పొందవచ్చు. 10 ఎకరాల భూమి ఉన్న రైతులు కనీసం ఐదు ఎకరాలలో ఈ పంటను సాగు చేయాలి. ఈ పంటకు ఉన్న గ్యారంటీ మరే పంటకు లేదు” అని తెలిపారు. రైతుల భారం తగ్గించేందుకు సబ్సిడీతో ఒక్కో మొక్కను రూ.25కే…
CM Revanth Reddy : రాష్ట్రంలో జూన్ నుంచి ఇప్పటివరకు సగటుతో పోల్చితే 21 శాతం తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వాతావరణ శాఖ సూచనల ఆధారంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరిగణలోకి తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్లో గరిష్టంగా డిమాండ్ ఉంటుందంటూ కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తిని స్వీకరించిన కేంద్ర మంత్రి.. తెలంగాణ రాష్ట్ర రైతుల డిమాండ్ ను నెరవేర్చే దిశగా ఆదేశాలు జారీ చేశారు. అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు.
Rythu Nestham : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన ‘రైతునేస్తం’ కార్యక్రమం సోమవారం (జూన్ 17) ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు వేదికల తయారీ, సాంకేతిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు మంత్రి ప్రత్యేక ఆదేశాలు…
“మన్ కీ బాత్” లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీ ప్రస్తావించారు. “డ్రోన్ దీదీలు” తెలంగాణలో వ్యవసాయంలో పెను మార్పులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేయడాన్ని మోడీ ప్రశంసించారు. "గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందారు. పండ్ల తోటలకు పురుగుమందులు, శీల్దార పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులకంటే వేగంగా, సమర్థవంతంగా పురుగుమందులను పిచికారీ చేయవచ్చు. నీటిని, మందుల వినియోగాన్ని 30–40 శాతం వరకు…
అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘నల్లమల డిక్లరేషన్’ను సైతం ఆవిష్కరించారు. ఈ డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం నల్లమల ప్రాంతం గురించి సీఎం ప్రసంగించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారని నాటి రోజులను సీఎం గుర్తు చేశారు. సీఎంగా ఇక్కడి నుంచి…
తెలంగాణలో యాసంగి పంట సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశంలో అత్యధిక వరి సాగు జరిగే రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు.
Uttam Kumar Reddy : తెలంగాణలో రబీ సీజన్‌కు సంబంధించి 57 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటల నుంచి 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, పౌర సరఫరాల శాఖా ముఖ్య…