Tummala Nageswara Rao : అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, పేమెంట్ సక్రమంగా జరుగుతున్నాయని కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మిల్లులకు ధాన్యం కోసం లారీల ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. సన్నరకం పండించిన రైతులకు బోనస్ గా 500 రూపాయలు ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు…
ఇప్పటి వరకు 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యం ఖరీదు 3,045.76 కోట్లు అని, సన్నాలకు 9.21 కోట్ల బోనస్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Thummala: రాష్ట్రవ్యాప్తంగా కొత్తరకం పంటలను రైతులకు పరిచయం చేయాలని వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
నిన్న అట్టహాసంగా వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై టీఆర్ఎస్ మంత్రలు వరుస పంచ్‌లు వేస్తున్నారు. తాజాగా ట్విటర్ మాధ్యమంగా మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘రాహుల్ గాంధీగారూ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ – చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ – రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం…
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సుని నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర లాభసాటి పంటల్ని సాగు చేయాలని, యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని అన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు దృష్టి పెట్టి, పంటల సాగులో ఆదర్శంగా నిలవాలన్నారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి,…