తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొనసాగుతున్న అవకతవకలను అరికట్టేందుకు అవినీతి నిరోధక శాఖ (ACB) పెద్ద ఎత్తున ఆకస్మిక దాడులు నిర్వహించింది.
ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దర్యాప్తు వేగవంతం చేసింది. సుదీర్ఘంగా 9 నెలల పాటు సాగిన విచారణ అనంతరం, ఈ కేసులో కీలక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి సమర్పించింది.
ACB Raids: తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. జనవరి నుంచి జూన్ వరకు కేవలం 6 నెలల్లో 126 కేసులు నమోదు చేసింది ఏసీబీ. జూన్ నెలలో 31 కేసులు నమోదు కాగా, అందులో 15 ట్రాప్, 2 అక్రమాస్తుల కేసు, 3 క్రిమినల్ దుష్ప్రవర్తన, 4 రెగ్యులర్ కేసులు, 7ఆకస్మిక తనిఖీల కేసులు ఉన్నాయి.
ACB Raids : కరీంనగర్‌కు చెందిన నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శ్రీధర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం తెల్లవారుజామున భారీగా దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్‌పై నమోదైన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు, పెద్దఎత్తున అక్రమ ఆస్తులు వెలుగులోకి తీసుకొచ్చారు. కరీంనగర్, సిద్ధిపేట్, వరంగల్, హైదరాబాద్ సహా మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని…
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2024లో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంది. 170 మంది ప్రభుత్వ అధికారులు దుష్ప్రవర్తన, లంచం తీసుకుంటూ.. ఏసీబీకి దొరికి పోయారు. ఈ ఏడాది తెలంగాణలో అవినీతిపై ఏసీబీ ఛేదించిన కేసుల వివరాలు, సమాచారాన్ని తాజాగా పంచుకుంది. అవినీతిలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖలు అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.
ACB Attacks: తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. వంద రోజుల్లో 55 కి పైగా ఏసీబీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అన్ని శాఖలో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది.