TG ACB: తెలంగాణ ఏసీబీ సంచలన విషయాలు.. ఈ ఏడాది అవినీతిలో ఆ శాఖలదే పైచేయి..
- ఈ ఏడాది తెలంగాణలో అవినీతిపై ఏసీబీ ఛేదించిన కేసులు
- పట్టుబడ్డ 170 మంది అధికారులు
- అవినీతిలో రెవెన్యూ మళ్లీ అగ్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2024లో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంది. 170 మంది ప్రభుత్వ అధికారులు దుష్ప్రవర్తన, లంచం తీసుకుంటూ.. ఏసీబీకి దొరికి పోయారు. ఈ ఏడాది తెలంగాణలో అవినీతిపై ఏసీబీ ఛేదించిన కేసుల వివరాలు, సమాచారాన్ని తాజాగా పంచుకుంది. అవినీతిలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖలు అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.
ఈ ఏడాది లంచం తీసుకుంటూ, దుష్ప్రవర్తనకు పాల్పడిన అధికారులు శాఖల వారీగా..
పోలీసు శాఖ: కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు 31 మంది లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
రెవెన్యూ శాఖ : 19 అధికారులు..
రిజిస్ట్రేషన్ శాఖ : 13 అధికారులు..
పంచాయత్ రాజ్ శాఖ: 24 మంది అధికారులు..
Also Read
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
ఈ ఏడాది ప్రధాన కేసులు: కుషాయిగూడకు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్ ఓ కేసును క్లోజ్ చేసేందుకు రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ.. పట్టుబడ్డారు. అలాగే.. హైదరాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. రూ. 3 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటూ.. ఏసీబీ అధికారులు చేతికి చిక్కాడు. అప్పటికే రూ. 5 లక్షలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సంగారెడ్డి ఇన్‌స్పెక్టర్ ఓ కేసులో రూ.1.5 కోట్లు డిమాండ్ చేశాడు. ముందుగా రూ. 5 లక్షలు పుచ్చుకుంటుండగా.. అడ్డంగా దొరికి పోయాడు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై ఏసీబీ చర్యలు తీసుకుంది. అతని వద్ద 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు, బ్రాండెడ్ వాచ్‌లు, ఐఫోన్‌లు వంటి విలాసవంతమైన వస్తువులతో సహా రూ. 250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వద్ద రూ.100 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. హైదరాబాద్ సీపీఎస్ ఏసీపీ వద్ద రూ. 3.95 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించి చర్యలు తీసుకుంది. శామీర్‌పేట తహశీల్దార్ రూ. 20 లక్షలు లంచం డిమాండ్ చేసి.. రూ.10 లక్షలు నగదు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
నేరారోపణలు:
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఏసీబీ నిందితులుగా తేల్చిన 170 మంది ప్రభుత్వ అధికారుల్లో 12 మంది దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారికి 1-4 సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించింది.
తాజావార్తలు
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!