Tech Layoffs: బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉద్యోగులకు ఉద్వాసన.. ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
- బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఉద్యోగులకు ఉద్వాసన..
- ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
- లీగల్ రిస్క్ లేకుండా ప్యాకేజీలు..
- ఇప్పుడు ఖర్చయిన భవిష్యత్తులో లాభమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Layoffs: గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలు వరసగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌రంగంలో ఉద్యోగులకు భద్రత కరువైంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఇలా ఉద్యోగుల్ని తీసేయడానికి టెక్ కంపెనీలు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. తీసేసిన ఉద్యోగులకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. సెవరెన్స్ ప్యాకేజీలు, నోటిస్ పే, అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్, వీసా సాయం, మానసిక ఆరోగ్య సహాయం వంటి వాటికి ఖర్చు చేస్తున్నాయి.
కంపెనీలు ఇలా చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. తొలగిస్తున్న ఉద్యోగులకు ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా తమ కంపెనీల ‘‘ఎంప్లాయర్ బ్రాండ్’’ని కాపాడుకోవాలని అనుకుంటున్నాయి. ఉద్యోగులను గౌరవంగా పంపడం ద్వారా మానవీయ కోణాన్ని చూపాలనుకుంటున్నాయి. లీగర్ రిస్క్ తగ్గడం కోసం సెవరెన్స్ ప్యాకేజీలను ఇస్తున్నాయి. దీంతో న్యాయ వివాదాలు తగ్గుతాయని భావిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా ఖర్చుపెట్టినప్పటికీ, తర్వాతి కాలంలో జీతాల ఖర్చులు తగ్గిపోవడంతో కంపెనీలు లాభాలు మెరుగుపడుతాయని అనుకుంటున్నాయి. దీంతో పాటు వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)కి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మానవవనరుల్ని తగ్గించి ఆటోమేటెడ్ ప్రాసెస్‌లకు మారడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
Read Also: Kantara Chapter 1 : ‘కాంతార చాప్టర్ 1’ 1000 కోట్ల మార్క్‌ను అడ్డుకున్న నిర్మాతలు?
గ్లోబల్ ఐటీ కంపెనీలు భారీగా ఖర్చు పెట్టి ఉద్యోగుల్ని సాగనంపుతున్నాయి. ఉదాహరణకు దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ 20,000 మంది ఉద్యోగులను తగ్గించడానికి రూ. 1135 కోట్లు ఖర్చు చేస్తోంది. యాక్సెంచర్ గత 3 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ సెవరెన్స్ ఖర్చు చేసింది. గూగుల్ 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించడానికి ఏకంగా 1 బిలియన్ డాలర్లను కేటాయించింది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా 2024-25లో 1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. అమెజాన్ 30,000 కార్పొరెట్ ఉద్యోగుల్ని తొలగించడానికి కూడా భారీగా ఖర్చు చేస్తోంది.
అయితే, దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కరుణ కాదని, రిస్క్ మేనేజ్మెంట్, కంపెనీలు ఇప్పుడు నష్టం భరిస్తే, భవిష్యత్తులో ఖర్చులు తగ్గుతాయని చెబుతున్నారు. ఏఐ కారణంగా పునర్‌వ్యవస్థీకరణ జరుగుతోందని, సెవరెన్స్ ప్యాకేజీ అనేది ఒక రకమైన ట్రాన్సిషన్ ఖర్చు మాత్రమే అని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, కంపెనీలు భారీగా ఖర్చు పెట్టడం కూడా వ్యాపార వ్యూహమే అని చెబుతున్నారు. ఇప్పుడు, ఐటీ రంగంలో ఉద్యోగుల్ని సాగనంపడం కూడా పెట్టుబడి లాంటిదే అని అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?