Rohit Sharma To Lead Team India In 2024 T20 World Cup: 2024 జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో కూడా రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో భారత జట్టును నడిపించడానికి రోహితే సరైన వ్యక్తని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ సెలక్టర్లు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. నవంబర్ 19న జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో భారత్ ఓటమి…
రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 నాలుగో మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా ప్లేయర్లు సమష్టిగా రాణించడంతో.. ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించింది యంగిస్థాన్. మరో మ్యాచ్ ఉండగానే.. 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదే సమయంలో టీ 20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది..
టీ20 క్రికెట్లో ఈరోజు టీమిండియా ఓ రికార్డు నెలకొల్పే సమయం వచ్చింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిస్తే.. అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు గెలిచిన రేసులో పాకిస్తాన్‌ను వెనక్కి నెడుతుంది. ప్రస్తుతం ఇండియా-పాకిస్తాన్ సంయుక్తంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్, పాకిస్తాన్‌లు 135-135 మ్యాచ్ ల్లో గెలుపొందాయి. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ ను దాటి ముందడుగు వేసేందుకు ఈరోజు మంచి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 226 టీ20 మ్యాచ్‌లు…
సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా ఈరోజు(గురువారం) ఎంపిక చేశారు. డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకు ఈ టూర్ జరగనుంది. ఈ టూర్ లో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో టీ20లు, వన్డే సిరీస్ లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. అయితే, డిసెంబరు 26 నుంచి జరిగే రెండు టెస్టుల సిరీస్ లో ఆడనున్నట్లు తెలిపింది.
Rahul Dravid Signs New Contract: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఉత్కంఠ వీడింది. టీమిండియా కోచ్‌గా కొనసాగేందుకు ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ బుధవారం అధికారికంగా వెల్లడించింది. టీమిండియా (సీనియర్ మెన్) హెడ్ కోచ్ మరియు సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్‌లను పొడిగించాం అని బీసీసీఐ తన ఎక్స్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ ద్రవిడ్‌తో పాటు సహాయక సిబ్బంది పదవీకాలాన్ని కూడా బీసీసీఐ…
Ashish Nehra rejects India Coaching offer: భారత్ క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వన్డే ప్రపంచకప్2023తో ముగిసింది. టీమిండియా కోచ్‌గా మరో దఫా కొనసాగాలని మెగా టోర్నీకి ముందే బీసీసీఐ ద్రవిడ్‌ను కోరింది. అయితే మిస్టర్ డిపెండబుల్ అందుకు సానుకూలంగా లేకపోవడంతో.. బీసీసీఐ మరో సరైన వ్యక్తిని వెతికే పనిలో పడింది. ఈ లోగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పజెప్పింది. టీమిండియా…
Rahul Dravid Not Keen To Continue As India Coach: భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ రావడం దాదాపుగా ఖాయం అయింది. వన్డే ప్రపంచకప్ 2023తో రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్ట్ ముగియగా.. ఇక ఆ పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలిపాడట. ద్రవిడ్ స్థానంలో హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 5 మ్యాచుల టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోన్న భారత…
పాకిస్తాన్ వక్రబుద్ధి పోనించుకోవడం లేదు. మొన్నటికి మొన్న మాజీ మిస్ ఇండియా ఐశ్వర్యా రాయ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్.. మరోసారి నోరుపారేసుకున్నాడు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపై విమర్శలు చేశాడు. క్రికెట్ గెలిచిందంటూ ఆయన ట్వీట్ చేశాడు.
విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ప్రస్తుతం వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది.
రోహిత్ శర్మ లాగే తాను కూడా టీమ్ కు ఉపయోగపడే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వ్యక్తిగతంగా మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదన్నాడు.