Asia Cup 2022: ఆసియా కప్‌లో సూపర్-4 రసవత్తరంగా మారింది. పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో ఇప్పుడు పాయింట్ల టేబుల్ ఆసక్తి రేపుతోంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై శ్రీలంక విజయం సాధించడంతో ప్రస్తుతం ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో పాకిస్థాన్ ఉంది. శ్రీలంక నెట్ రన్‌రేట్ 0.589గా నమోదు కాగా పాకిస్థాన్ నెట్ రన్‌రేట్ 0.126గా ఉంది. టీమిండియా నెట్ రన్‌రేట్ మాత్రం -0.126గా, ఆప్ఘనిస్తాన్ నెట్ రన్‌రేట్ -0.589గా ఉంది. పాయింట్ల పట్టికలో…
IND Vs PAK: దుబాయ్ వేదికగా టీమిండియాతో సూపర్-4లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 181/7 పరుగులు చేసింది. 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ రిజ్వాన్ హాఫ్ సెంచరీతో పాకిస్థాన్ జట్టును ఆదుకున్నాడు. అతడు 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71…
IND Vs PAK: దుబాయ్ వేదికగా సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (28), రోహిత్ (28) జోరుతో టీమిండియా 200 పరుగులకు పైగా స్కోరు చేస్తుందని అభిమానులు ఆశించారు. ఓపెనింగ్‌లో శుభారంభం దక్కినా ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయిన భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 60…
IND Vs PAK LIVE UPDATES: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో భారత్, పాకిస్థాన్ జట్లు ఈరోజు మరోసారి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.
Rahul Dravid: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత పేసర్ అవేష్ ఖాన్ ఆడే పరిస్థితి లేదని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియా సమావేశంలో వెల్లడించాడు. అవేష్ ఖాన్ జ్వరం బారిన పడ్డాడని.. అందుకే నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరం అయ్యాడని వివరించాడు. మరోవైపు పాకిస్థాన్ బౌలింగ్ లైనప్ బాగుందని.. వాళ్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ద్రవిడ్ ప్రశంసించాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ బౌలింగ్…
Team India: సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టైటిల్ కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్న టీమిండియాకు బిగ్‌షాక్ తప్పేలా కనిపించడంలేదు. మోకాలి గాయంతో ఆసియా కప్‌కు దూరమైన భారత స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌కు సైతం దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మోకాలి సర్జరీ నేపథ్యంలో జడ్డూ ప్రపంచకప్ ఆడకపోవచ్చని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. జడేజా కోలుకోవడానికి ఆరు నెలల సమయం కంటే ఎక్కువ పట్టవచ్చని అభిప్రాయపడింది.…
టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో ఆసియా కప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన జడేజా, తాజాగా కుడి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దాంతో, ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్ లకు జడేజా అందుబాటులో ఉండడని ప్రకటించింది బీసీసీఐ. ప్రస్తుతం జడ్డూ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని బోర్డు కార్యదర్శి జై షా తెలిపారు. ఇక, జడేజా స్థానంలో…
IND Vs HKG: ఆసియా కప్‌లో దుబాయ్ వేదికగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన హాంకాంగ్ 20 ఓవర్లు ఆడినా 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 40 పరుగుల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో…
IND Vs HKG: ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ (21) నిరాశపరచగా.. ఫామ్‌తో తంటాలు పడుతున్న కేఎల్ రాహుల్ (36) నత్తనడకన బ్యాటింగ్ చేశాడు. దీంతో పసికూన హాంకాంగ్‌పై టీమిండియా ఎంత స్కోరు చేస్తుందనే విషయంపై అభిమానుల్లో ఉత్కంఠ రేపింది. అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన విరాట్…
Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది ఐసీసీ. ఆదివారం నాడు దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోపు భారత్, పాకిస్థాన్ జట్లు తమ ఓవర్లను పూర్తి చేయలేకపోయాయి. దీంతో రెండు జట్లు జరిమానా బారిన పడ్డాయి. ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ రిఫరీ ముందు తమ తప్పును అంగీకరించారని ఐసీసీ ప్రకటించింది. ఇటీవల…