దేశంలో టీ ప్రియులకు కొరత లేదు. అలసట నుంచి ఉపసమనం పొందేందుకు కొందరు టీ తాగుతుంటారు. అందుకే గ్రీన్ టీ, బ్లాక్ టీ, మిల్క్ టీ, చమేలీ టీ వంటి రకరకాల టీలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఎవరినైనా కలిసినా లేదా ఏదైనా చర్చించాలనుకున్నా టీ తాగుతూ మాట్లాడుకుందాం అని అంటారు. కొంతమంది టీ తాగడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. తలనొప్పిని టీ తగ్గిస్తుందని భావిస్తారు. నిజానికి టీలో ఉండే కెఫిన్ మొత్తాన్ని బట్టి, ఇది తలనొప్పిని తగ్గించడమా.. లేక పెంచడమో చేస్తుందంట. అందువల్ల పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. కెఫిన్ వినియోగాన్ని పరిమితం చేయాలి. అలాగే, తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కెఫిన్ ను మందుగా ఉపయోగించడం మానుకోవాలని సూచిస్తున్నారు.
READ MORE: Karnataka: కూతురి ప్రైవేట్ వీడియోలు వైరల్ చేసిన తండ్రి.. ఆత్మహత్యాయత్నం..
మీరు కెఫిన్ లేని హెర్బల్ టీని ఉపశమనం కోసం తీసుకోవచ్చు. మూలికా టీలలో అల్లం కూడా ఉంటుంది. అల్లం టీ తాగడం వల్ల మైగ్రేన్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎమర్జెన్సీ మెడిసిన్, ప్లేసిబో చికిత్సతో పోలిస్తే అల్లం చికిత్స రోగులను రెండు గంటల్లో నొప్పి లేకుండా చేసింది. ప్లేసిబోతో పోలిస్తే అల్లం వికారం మరియు వాంతులు తగ్గించిందని పరిశోధకులు చెపుతున్నారు. అల్లం టీతో పాటు పుదీనా, ఫీవర్ఫు, లవంగం టీ వంటి హెర్బల్ టీలు కూడా తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయంట. టీ అంటే ఎంత ఇష్టం ఉన్నా.. దానిని తక్కువ మోతాదులో తీసుకోవాలంట. రెండు కంటే ఎక్కువసార్లు టీ తాగడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అంతే కాదు టీ ఎక్కువగా తాగడం వల్ల నిద్ర సమస్యలు, ఇనుము లోపం, కడుపు చికాకు, మైకము వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంట.