అమరావతి: నేడు బెంగళూరుకు వైఎస్ జగన్. మధ్యామ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు జగన్.
అమరావతి: వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సందర్భంగా కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టునున్న వైసీపీ శ్రేణులు. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి. హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణలు.
ఇవాళ ఏపీ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు. కోస్తా జిల్లాల్లో 39-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ. రాజధాని అమరావతి నిర్మాణంపై కేబినెట్‌లో చర్చ. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ. జూన్ 21న వైజాగ్ జరిగే అంతార్జాతీయ యోగా డే పైనా చర్చ.
నేడు రెండోరోజు శ్రీశైలం ప్రాజెక్ట్‌కు సీడబ్ల్యూసీ శాస్త్రవేత్తల బృందం. జలాశయంపై బ్యాతమేటిక్ సర్వే చేపట్టనున్న నిపుణుల బృందం. ఫంజ్‌పూల్ లోతు, విస్తీర్ణం అంశాలపై సర్వే చేయనున్న బృందం.
నేడు జీహెచ్‌ఎంసీ 11వ కౌన్సిల్ సమావేశం. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న కౌన్సిల్ సమావేశం.
అమరావతి: కూటమి పాలనకు ఏడాది పూర్తి, ఇవాళ జనసేన సంబరాలు. సుపరిపాలన ప్రారంభమై ఏడాది.. పీడ విరగడై ఏడాది.. నినాదంతో వేడుకలు. రాష్ట్రవ్యాప్తంగా దీపావళి, సంక్రాంతి తరహాలో వేడుకలకు పవన్ పిలుపు. ఏడాది పాలనపై ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జనసేన సిద్ధం.
HYD: నేడు ఉద్యోగ జేఏసీతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ.
నేడు గాంధీభవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతి పత్రాల స్వీకరణ.
HYD: నేడు ఇందిరాపార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ధర్నా. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహాధర్నా. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై నిరసన. కేంద్రసంస్థలు కేసీఆర్‌ను టార్గెట్ చేశాయని కవిత ఆగ్రహం.