టిడిపి అధినేత చంద్రబాబుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో చంద్రబాబుకు చిప్పకూడు ఖాయమని..చంద్రబాబుకు ముని శాపం ఉంది నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు అందరూ దొంగలే అయినా దొరలాగా తిరిగారని..చంద్రబాబు నాయుడి, అచ్చెం నాయుడు, దేవినేని ఉమకు త్వరలో జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న పాలడెయిరీలు అన్నిటిని నిర్వీర్యం చేసాడని… సంగం డైరీ ఎవడబ్బ సొత్తు…
నారా లోకేష్ పై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. లోకేష్ లాంటి వింత జీవి అస్సలు భూమి పైన కనిపించదని ఎద్దేవా చేశారు. “18-45 మధ్య వయసు వారికి ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామని మొదట ప్రకటించింది సిఎం జగన్ గారే. ఆ తర్వాతే కేంద్రం ఫ్రీ వ్యాక్సిన్ నిర్ణయం వెల్లడించింది. కరోనాపై కేంద్రానికి నివేదికలు పంపుతుంటానని డప్పు కొట్టుకునే బాబుకు ఇది కనిపించలేదా. విషం చిమ్మడమే కాదు. మెచ్చుకోవడం కూడా నేర్చుకో బాబూ. లోకేశ్…
టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి లో ఒక్కొక్కరు జైలు పాలవుతుంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. “రాష్ట్రంలో అన్ని స్థాయిల ఎన్నికలు పూర్తయ్యాయి. కరోనా నియంత్రణ చర్యల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. ఇంక ఎవరి దృష్టి మళ్లిస్తే ఎవరికి లాభం చంద్రబాబూ? నీ బందిపోటు ముఠాలో ఒక్కొక్కరు జైలు పాలవుతుంటే భయం పట్టుకుందా? పొంతన లేకుండా మాట్లాడుతున్నావు. తుని నియోజకవర్గంలో తుక్కు తుక్కు అయ్యాక ఫ్రస్టేషన్ పీక్…
విశాఖ టిడిపి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చంద్రబాబుకు తెలుగు ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అచ్చెన్నాయుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా కష్టాన్ని, శ్రమను నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు అని.. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడని పేర్కొన్నారు. ఆయన చేయని పదవులు లేవని.. ఉమ్మడి ఏపీకి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. ఎంతో మంది ప్రధానులను, ప్రెసిడెంట్ లను నిర్ణయించిన వ్యక్తి అని.. మళ్లీ చంద్రబాబు సీఎం…
తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు పడలేదని…పోలింగ్ 50 శాతమే నమోదయిందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పినట్లు బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసి ఉంటే పోలింగ్ 80-90 శాతం గాని జరిగి ఉండాలి… కానీ అలా ఏమి జరగలేదని తెలిపారు మంత్రి కొడాలి నాని. తిరుపతి ఎన్నికలలో వైసిపి ఖచ్చితంగా గెలుస్తుంది…. 4 లక్షల 50 వేల మెజారిటీతో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కొడాలి నాని. కరోనా నియంత్రణకు లాక్…
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఉప ఎన్నిక ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ముందుకు వచ్చి ఓట్లు వేసే వాతావరణం ఉంది. గతంతో పోల్చితే ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ పోలింగ్ జరుగలేదు అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. తిరుపతిలో చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు కుట్ర పూరితంగా ఆలోచించటానికి అలవాటు పడ్డాడు. దొంగ ఓట్లు వేసేటట్లు అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు వేయరు చంద్రబాబు…
చైనా లో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. మొన్నటివరకు రోజువారీగా లక్షలోపు కరోనా కేసులు నమోదవగా.. ఇప్పుడు ఏకంగా 2 లక్షలు దాటుతున్నాయి. అయితే ఈ వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు కరోనా సోకింది. అయితే తాజాగా విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా…
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, సీఎం వైఎస్ జగన్కు కొత్త పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.. సీఎం కుర్చీలో ఉన్నవారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుంది.. కానీ, జాంబీ రెడ్డి.. టిడిపి నేతలు, కార్యకర్తల అరెస్టులతో ఆనందిస్తున్నారని మండిపడ్డారు..…
రాప్తాడు నియోజకవర్గంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని పులెటి పల్లి గ్రామంలో నిన్న ఉగాది పండుగ కావడంతో గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవం జరిగింది. ఉత్సవాన్ని తిలకిస్తున్న టిడిపి వర్గీయులు పై వైసీపీ వర్గీయులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. గతంలో గ్రామానికి చెందిన చెరువులో చేపలు పట్టే నెపంతో వైసీపీ…