కాకని గోవర్ధన్ రెడ్డిపై టిడిపి నేత సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. కాకని గోవర్ధన్ రెడ్డి చెప్తున్న మాటలు అన్ని అవాస్తవమని.. ఆనందయ్య పర్మిషన్ లేకుండా ఆన్లైన్ లో మందు పంపిణీ పెట్టారు..అది ప్రశ్నిస్తే తప్ప ? అని నిలదీశారు. గోవర్ధన్ రెడ్డి బాష..దారుణంగా ఉందని..హద్దులేకుండా మాట్లాడటం సబబు కాదని చురకలు అంటించారు. రాజకీయంగా అనవసరంగా మందు పంపిణీ ఆపారని..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పినా మందు పంపిణీ ఆపారని మండిపడ్డారు. తెలుగుదేశం మందు పంపిణీకి పూర్తి మద్దతు ఇస్తుందని..మా కుటుంబాలను తిట్టడం సరి కాదని పేర్కొన్నారు. వెబ్ సైట్ ఓపెన్ చేసిన వారిపై కేసులు పెట్టాలి అంతేగాని మాపై పెడతారా ? అని ప్రశ్నించారు. ఇంత నీచమైన బాష ఎక్కడా చూడలేదు..మా కుటుంబంలో చనిపోయిన వారిమీద కూడా మాట్లాడుతున్నావని మండిపడ్డారు. మానవత్వం లేకుండా మాట్లాడతున్నావు నీది ఒక బతుకా? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయించు చూసుకుందామని సవాల్ విసిరారు. గెలుపు, ఓటములు సహజమని.. నీకు మానవత్వం లేదని ఫైర్ అయ్యారు.