విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి వైజాగ్లో దర్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై మోడీకి సీఎం జగన్ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగం ఏంటి..? రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా..? అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కేంద్రంపై…
ఇవాళ విజయవాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. బీజేపీ, జనసేన, సీపీఐ అందరూ చంద్రబాబు దొంగల ముఠా అని… బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ మొదటి సారి జీవితంలో నిజం మాట్లాడారని నిప్పులు చెరిగారు. టీడీపీలో ఒక సామాజిక వర్గానికే చోటు ఉంటుందని వాస్తవం చెప్పారని.. కానీ సాయంత్రానికి ప్యాకేజీ తీసుకుని గళం మార్చారని పేర్కొన్నారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టాలనుకుంటున్నారా? వాళ్ళు…
పార్టీ గుర్తు మీద జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీ ని ఆశీర్వదిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ స్వీప్ చేస్తుంది అని తెలిసే చంద్రబాబు గత ఏడాది కోవిడ్ వంకతో వాయిదా వేయించారని అన్నారు. సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చిన తీరు కూడా ఈ ఫలితాలకు ఒక కారణం అని అన్నారు. ఎస్ఈసీ వాలంటీర్ల పై పెట్టిన ఆంక్షలు అసంబద్ధ అని…