టీడీపీ పార్టీ నుంచి జూమ్ పార్టీ గా మారింది. చంద్ర బాబు నాయుడు జూమ్ పార్టీ అధ్యక్షులు అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కరోనా వచ్చిన జగన్ అని ప్రాజక్ట్ లు పూర్తి చేయడానికి పని చేస్తున్నారు. కరోనా వచ్చాక మీరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కేవలం జూమ్ ల ద్వారా విమర్శలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని కూడా అవ్వలేదు. ప్రతి పక్ష నాయుకుడిగా ప్రజల కోసం…
మైదుకూరు నియోజకవర్గంలో పోలీసుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు…రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు. నియెజకవర్గంలోని టీడీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు అని తెలిపారు. మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చట్ట పరమైన చర్యలకు వెళ్తున్నాం అని తెలిపిన ఆయన డిఎస్పీ, సిఐ, ఎస్సైల అక్రమాలపై కోర్టులో కేసులు వేశాం అని…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. చంద్రబాబుకు వయసు, టైమ్ అయిపోయిందని.. అందుకే జూమ్ లో కాలక్షేపం చేస్తున్నాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. “గడియారం ముల్లుపై ఆశలు పెట్టుకుని జూమ్ లో కాలక్షేపం చేస్తుండు. శాశ్వతంగా అక్కడే మిగిలిపోతావు. కాలం పరుగులు పెడుతూనే ఉంటుంది. దానితో పోటీపడి పని చేస్తుంటాడు యువ సిఎం. నీకు వయసు మీద పడింది. టైమ్ అయిపోయింది. ముల్లు వెనక్కి తిరగదు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక…
టిడిపి నిర్వహిస్తున్న మహానాడుపై మరోసారి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని పెట్టుకో సరిపోతుందని ఎద్దేవా చేశారు. “వైఎస్సార్ పంటల బీమా పథకంపై పడి ఏడుస్తాడు. రైతు భరోసా కింద డబ్బులిస్తే కేంద్ర నిధులంటాడు. కేంద్ర నిధులైతే అన్ని రాష్ట్రాల్లో ఉండాలిగా చంద్రబాబూ? మహానాడులో అబద్ధాలు ప్రచారం చెయ్యడానికి సిగ్గులేదూ ? మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని…
విశాఖ బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడుపల్లా శ్రీనివాస్, tnsf రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీని రంగం ద్వారా ఎన్టీఆర్ తెలుగు జాతికి మంచి పేరు తెచ్చారని..రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.. ఓటుకు నోటు కేసులో భయపడి అప్పట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చారని.. సినిమా డైరెక్టర్లను తీసుకువచ్చి విఠాలాచార్య అట్టముక్కలు, గ్రాఫిక్స్ లు ప్రజలకు చూపించిన వ్యక్తి చంద్రబాబేన్న ఆయన.. ఇక్కడ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించడంతో.. మళ్లీ హైదరాబాద్ కు పారిపోయారని ఎద్దేవా చేశారు.. ఇక, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేశారు.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలు…
ఆనందయ్య మెడిసిన్పై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులో సీవీఆర్ ఫౌండేషన్ బిల్టింగ్లో అనధికారికంగా వేల మందికి మందు తయారు చేస్తున్నారని, ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవని ఆయుష్ కమీషనర్, స్టేట్ హెల్త్ ప్రకటించినా ఎందుకు మందును పంపిణీ చేయడంలేదని టీడీపీ నేత సోమిరెడ్డి ప్రశ్నించారు. ఆనందయ్య బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం వలనే ఇలా చేస్తున్నారని, అదే అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయి ఉంటే ఇన్ని రోజులు అక్రమంగా ఆయన్ను నిర్భందించేవారా…
ఇవాళ టిడిపి మహానాడు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహానాడు కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతారు..? అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతావ్ బాబూ? కుప్పంలో ఎందుకు ఖంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో…
తాము చేయలేని పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తొందనే కడుపుమంట టీడీపీని నిలవనీయడం లేదంటూ ఎద్దేవా చేశారు మంత్రి కన్నబాబు.. గత రెండేళ్ల కాలంలో రూ. 83 వేల కోట్లు వ్యవసాయానికి.. రైతులకు ఖర్చు పెట్టామన్న ఆయన.. ఉచిత బీమా చెల్లింపులను టీడీపీ చిన్న విషయంగా చూస్తోందని ఫైర్ అయ్యారు.. రూ.3783 కోట్లు పంటల బీమా నిమిత్తం చెల్లించాం.. టీడీపీ హయాంలో కట్టాల్సిన బీమాను కూడా మేమే చెల్లించామన్న కన్నబాబు.. టీడీపీ హయాంలో రూ. 2900 కోట్లు…