ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డ్రగ్స్ వ్యవహారం నుంచి ఎలా బయట పడేయాలన్న బెరుకు, కంగారు సజ్జల మాటల్లో కనిపించాయి అని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. జగనుకు లేని క్యారెక్టర్ని ఎవరుఎలా నాశనంచేస్తారో సజ్జల చెప్పాలి అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీ అంతా పారదర్శకంగానే జరుగుతోందని సజ్జల గుర్తించాలి. 28 టన్నుల హెరాయిన్ రాష్ట్రంలోకి దిగుమతి అయితే ముఖ్యమంత్రి, డీజీపీ ఏం లేనట్లే మాట్లాడారు. కనీసం సజ్జలైనా ఈ వ్యవహారంలో తనచిత్తశుధ్దిని పరీక్షించుకోవాలి. ప్రభుత్వ సలహాదారుగా డ్రగ్స్ వ్యవహారంలో ప్రమేయమున్న అధికార పార్టీ పెద్దలపేర్లు బయట పెట్టాలి. బాబాయిని చంపిన వారెవరో జగన్ ఎందుకు కనిపెట్టలేకపోతున్నాడు అని అడిగారు. తిరుపతి ఉపఎన్నికలో జగన్ కాళ్లు పిసికేవాడిని నిలబెట్టారు కాబట్టే, టీడీపీ పోటీలో నిలిచింది అని పేర్కొన్నారు.