టీడీపీ మహానాడుకి జనం పోటెత్తారు. ప్రకాశం వేదికగా సైకిల్ పార్టీ గుబాళించింది. మహానాడు2022 సందర్భంగా నారా లోకేష్ మీడియాతో ముచ్చటించారు. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు.. ప్రజలను హింసించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడరునే హింసిస్తోందన్నారు. ఓ ఎమ్మెల్సీ తన డ్రైవర్, పార్టీ కార్యకర్తనే చంపేస్తే.. మరో ఎమ్మెల్యే తన పార్టీ గ్రామ స్థాయి నేతను హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.…
మహానాడు వేదికగా ఒకవైపు టీడీపీ నేతలు అధికార పార్టీపై విమర్శల దాడి చేస్తుంటే… వైసీపీ నేతలు కూడా అదే రీతిలో టీడీపీని టార్గెట్ చేశారు. చంద్రబాబు పుట్టుకకు నిర్వచనం చెప్పారు ఎంపీ విజయ సాయిరెడ్డి. చంద్రబాబు, టీడీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ సాయిరెడ్డి. వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లి కి పుట్టిన ఉన్మాది బిడ్డ చంద్రబాబు అన్నారు విజయసాయి. ఉన్మాదంతోనే పిల్లను ఇచ్చిన పాపానికి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడు. మరో…
ఏపీలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అందునా శ్రీకాకుళం జిల్లాలో బంధువుల మధ్యే రాజకీయ వైరం ముదురుతోంది. టీడీపీ నేత కూనరవి- స్పీకర్ తమ్మినేని మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. టీడీపీపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కూన రవి. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకం తమ్మినేని. తమ్మినేనిని ఆముదాల వలసలో సజీవంగా దహనం చేస్తారు. తమ్మినేని పాడె మోయడానికి కూడా ఎవరు ఉండరని ఘాటైన…
బెజవాడలో ఇటీవల మెగా అభిమానులు నిర్వహించిన సమావేశం ఇది. ఒకప్పుడు ఫ్యాన్స్ మీటింగ్ అంటే.. చిరంజీవి చేపట్టే సేవా కార్యక్రమాలు.. సినిమాల చుట్టూ చర్చ జరిగేది. విజయవాడ సమావేశం మాత్రం పూర్తిగా రాజకీయ అజెండా చుట్టూ తిరిగింది. జనసేనాని పవన్ కల్యాణ్ కేంద్రంగా జరిగిన ప్రసంగాలు.. ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో చర్చగా మారాయి. పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలని.. అందుకోసం పనిచేయాలని మెగా అభిమానులు తేల్చేశారు. అయితే ఇది వాళ్లకు వాళ్లుగా చేసిన కామెంటా లేక ఎవరైనా…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం వైసీపీ వర్గ విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ఈస్థాయిలో ఎక్కడా వర్గపోరు లేదు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నవీన్ నిశ్చల్‌ను కాదని.. 2019లో మాజీ పోలీస్ అధికారి మహ్మద్ ఇక్బాల్‌కు టికెట్ ఇచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని టాక్. బాలకృష్ణ చేతిలో ఇక్బాల్ ఓడినా.. తర్వాత ఆయన్ని ఎమ్మెల్సీని చేశారు. అప్పటి నుంచి హిందూపురంలో ఇక్బాల్ పెత్తనం పెరిగడం.. నవీన్ వర్గానికి అస్సలు రుచించడం…
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నన్ను అంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ఓ కేసు విషయంలో ఏలూరు జిల్లా కోర్టులో సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రైవట్ కేసు ఫైల్ చేసిన ఆయన… ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ఆరాచకాలపై కేంద్ర…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై అప్పుడు పెద్ద చర్చ సాగుతోంది.. అయితే, ఇప్పటికే పలు సందర్భాల్లో పొత్తులపై మాట్లాడిన బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్.. మరోసారి క్లారిటీ ఇచ్చారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే విషయంపై పలు రకాల వార్తలు వస్తున్నాయి.. టీడీపీ, వైసీపీలకు బీజేపీ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక, జనసేన పార్టీతో మాత్రమే పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని కార్యకర్తలకు స్పష్టం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2024 టార్గెట్‌గా కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ వంటి ప్రధాన పార్టీల వ్యూహాలతోపాటు మాజీ ఐపీఎస్ వి.వి.లక్ష్మీనారాయణ కదలికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేన తరుఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజాసేవకుడిగా మారతానని “బాండ్ పేపర్” రాసిచ్చినా ఆయన్ని జనం ఆదరించలేదు. ఆ తర్వాత జనసేనకు రాజీనామా చేసి తన ఫౌండేషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. రైతు…
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన రొటీన్‌కు భిన్నంగా సాగింది. కర్నూలు సమావేశంలో పార్టీ కేడర్ స్పందన, రోడ్ షోలకు లభించిన ఆదరణకు ఫుల్ ఖుషీ అయ్యి కీలక ప్రకటన చేశారు. డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు. బాబు నోటి వెంట ఈ ప్రకటన రాగానే పార్టీ శ్రేణులు నివ్వెర పోయాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థిని ప్రకటించిన ఉదంతాలు లేకపోవడంతో అది చర్చగా మారింది. దీని వెనక టీడీపీ వ్యూహం…