ఏపీలో పదవతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాల పై వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ట్విట్టర్ లో లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ‘నారాయణ’ ప్రశ్న పత్రాలను లీక్ చేయడమే కారణం పప్పు నాయుడూ. పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం మీదే. దిగజారి…
ఏపీలో 2024 కి ముందే ఎన్నికలు రానున్నాయా? వస్తే ఆయా పార్టీల పరిస్థితి ఎలా వుండబోతోంది. పొత్తుల విషయంలో బీజేపీ. టీడీపీ, జనసేన ఏం చేయబోతున్నాయి. ఏపీ పాలిటిక్స్ ని డిసైడ్ చేసే శక్తి పవన్ కళ్యాణ్ లో ఉందా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనకు అన్యాయం చేసాడంటూ నాని బాబాయి నాగయ్య ఆందోళనకు దిగడం చర్చనీయాంశం అయింది. కేశినేని భవన్ పక్కన తన బిల్డింగ్ నిర్మాణం నిలిపేయాలని టౌన్ ప్లానింగ్ నోటీసులు జారీచేసింది. టౌన్ ప్లానింగ్ ను ఉసిగొల్పి అక్రమ నోటీసులు కేశినేని నాని ఇప్పించాడంటున్నారు నాగయ్య. నాగయ్య ఊర్లో లేనపుడు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కేశినేని నాని దుర్మార్గుడు.. నా ఆస్తి లాక్కోవాలని చూస్తున్నాడు అంటూ అందోళనకు దిగడంతో ఈ అంశం బెజవాడలో…
తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. పార్టీ ఆవిర్భావ సమయంలో స్వయంగా ఆ పార్టీ అధినేత ఎన్టీ రామారావు తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కూడా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ చాలా సార్లు విజయం సాధిస్తూ వచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి గాలి వీచినా …చంద్రబాబు సొంత జిల్లాలో కుప్పం మినహా మిగిలిన నియోజకవర్గాల వేల సంఖ్యలో ఓట్ల తేడాతో టీడీపీ ఓటమి…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు తిరుపతి లోక్సభ సీటు గెలిచిన బీజేపీ.. ప్రస్తుతం ఉందా లేదా అన్నట్టుగా మారిపోయింది. జిల్లాలో గుర్తింపు పొందిన కమలనాథులు ఏమైపోయారో అని కేడర్ ప్రశ్నించుకుంటున్న పరిస్థితి ఉంది. బాదుడే బాదుడు పేరుతో టీడీపీ నియోజకవర్గాలను చుట్టేస్తోంది. జనసేన కూడా ఏదో ఒక నిరసనతో జనాల్లో ఉండేందుకు చూస్తోంది. అధికారపార్టీ వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం అని ఊరూరా తిరుగుతోంది. ఈ రాజకీయ సందడిలో కనిపించంది బీజేపీ నేతలేనని లోకల్గా చెవులు…
పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్యతో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆయన కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను శనివారం పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి నర్సరావుపేటలో టీడీపీ నేతలు పర్యటించాలని తలపెట్టారు. సోమవారం నాడు వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రావులాపురంలో టీడీపీ బీసీ నేతలు పర్యటించనున్నారు. ప్రత్యర్థుల చేతిలో హతుడైన జల్లయ్య కుటుంబాన్ని వాళ్లు పరామర్శించనున్నారు. Ganta Srinivasrao: టెన్త్ ఫలితాలు వాయిదా వేయడం…
మరోసారి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు సీఎం జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పాపం జగనుదేనని, పోలవరం విషయంలో జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 2021 జూన్ కల్లా పోలవరం పనులు పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పేశారని, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను నిర్వాసితులకు ఇవ్వలేదని, పోలవరానికి సంబంధించి కేంద్రం నిధులేమయ్యాయో జగన్ ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వ్యక్తి వెదిరె…
ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారనే అభియోగంతో టీడీపీ మహిళా నేత గౌతు శిరీషకు నిన్న సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజా ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. గౌతు శిరీష కుటుంబాన్ని అణచివేయటానికి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ర్టంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తుందని, ప్రజా సమస్యలపై గొంతు విప్పాలని ప్రయత్నిస్తే అరెస్ట్ చేయాలఇ భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చారిత్రక నేపథ్యం ఉన్న కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని, బీసీ…
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాతో నిరాధరమైన పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ నేతల సోషల్ మీడియా ఖాతాలను ఫోర్జరీ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న అధికార వైసీపీ మద్దతుదారులపై కేసులు నమోదు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. దురుద్దేశంతో రెండు రాజకీయ వర్గాల మధ్య…
ఏపీలో తరచూ వినిపిస్తున్న పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వన్ సైడ్ లవ్ అనే కామెంట్లు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారు. చంద్రబాబుకు క్లారిటీ వచ్చాక.. మిగిలిన విషయాలు మాట్లాడతాం.రాష్ట్రం కోసం నేను తగ్గడానికి సిద్దం. అన్నిసార్లు తగ్గాను.. ఈసారి మిగిలిన వాళ్లు తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాను. టీడీపీ కొంత తగ్గితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ సూచించారు. బీజేపీతో సంబంధాలు బాగున్నాయంటూ పవన్ స్పష్టీకరించారు. పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లపై చర్చిద్దామని…